Movie News

శ్రీలీల నుంచి లాగేసుకున్న కాయదు?

పుట్టి పెరిగింది కర్ణాటకలో అయినా.. సినిమాల్లో రంగప్రవేశం చేసింది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే అయినా.. శ్రీలీల అచ్చమైన తెలుగమ్మాయే. ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆ సినిమాతో మంచి పేరు సంపాదించి తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది. చూస్తుండగానే నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి గట్టి పోటీదారు అయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసింది.

కానీ ఈ మధ్య ఉన్నట్లుండి ఆమె జోరు తగ్గింది. వరుసగా ఫెయల్యూర్లు రావడం.. తన యాక్టింగ్ మీద విమర్శలు రావడంతో కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది. తెలుగులో శ్రీలీల జోరు బాగా తగ్గింది. అదే సమయంలో తమిళంలో ఒక భారీ చిత్రం నుంచి శ్రీలీలను తప్పించారనే వార్త ఇప్పుడు కోలీవుడ్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్న ‘డేర్ డెవిల్’లో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు కొన్ని నెలల కిందట వార్తలు వచ్చాయి. అజిత్ సరసన శ్రీలీల మరీ చిన్నపిల్లలా ఉంటుందేమో అన్న చర్చ జరిగినప్పటికీ.. ఆమెనే దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఫైనలైజ్ చేసినట్లు చెప్పుకున్నారు. టీం కూడా ఆ వార్తలను ఖండించకపోవడంతో శ్రీలీల గోల్డెన్ ఛాన్స్ పట్టేసిందని అంతా చర్చించుకున్నారు. కానీ ఇప్పుడేమో ఆమెను ‘డేర్ డెవిల్’ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. తన స్థానంలోకి కాయదు లోహర్ వచ్చిందన్నది లేటెస్ట్ న్యూస్.

‘డ్రాగన్’ సినిమాతో తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది కాయదు. కానీ ఆమెకు కూడా ఇటీవల అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. తెలుగులో నటించిన ఫంకీ, ది ప్యారడైజ్ సినిమాలు నిరాశపరిచాయి. ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. కాయదుకు ప్రేక్షకుల్లో మంచి క్రేజే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను అజిత్‌కు జోడీగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అసలే సినిమాలు హిట్టవ్వట్లేదు, ఛాన్సులు తగ్గిపోతున్నాయి అనుకుంటుంటే.. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పించడం శ్రీలీల కెరీర్‌కు తీవ్ర ఇబ్బందికరమే.

This post was last modified on October 26, 2026 10:29 am

Share

Recent Posts

బతికితే బాలయ్యలా బతకాలి

https://youtu.be/GBEMMz7D6C8?si=nOeiImX8VJI8Cl2H నందమూరి బాలకృష్ణతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. ఆయనది బిందాస్ జీవితం అని. దేని గురించీ…

2 hours ago

ఇది కదా అసలైన రాజకీయం అంటే

రాన్రాను రాజకీయాల్లో విద్వేష కల్చర్ పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు విభేదాలు ఉండేవి. విధానాల పరంగా…

2 hours ago

నిఖిల్ ఒక్కడే నిందలకు బాధ్యుడా

ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం.…

11 hours ago

మారుతి కొత్త సినిమా… ఇచ్చిన ఆఖరి మాట కోసం

హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత…

12 hours ago

సినిమాల్లో వర్షం సీన్లకు బ్రేక్

సినిమాల్లో వర్షం నేపథ్యంలో సన్నివేశాలు.. పాటలు పెట్టడం కామన్. పాటల్లోనే కాదు.. ఫైట్లలోనూ రెయిన్ ఎఫెక్ట్ ఉంటే ప్రేక్షకులకు ఒక…

13 hours ago

జైలర్ 2 వల్ల కానిది ఎవరు చేయగలరు

జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తమిళనాడులో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తుండగా ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్…

13 hours ago