Political News

మహిళల స్థానంలో పురుషుల నామినేషన్లు

స్థానిక ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక చోట అత్తా కోడళ్ళు పోటీ పడితే, మరోచోట అన్నా దమ్ములు తలపడుతున్నారు. ఇద్దరు స్నేహితులు చెరో పార్టీ తరపున పోటీకి నిలబడటం ఆసక్తిగా మారింది. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మున్ముందు కూడా జరుగుతాయి. కాకపోతే ఈసారి మరికొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. మహిళలకు కేటాయించిన సీట్లకు పురుషులు నామినేషన్లు వేయడంతో జనం నవ్వుకుంటున్నారు.

రిజర్వేషన్లలో భాగంగా అనంతపురం జిల్లా విడపనకల్లు ఎంపీటీ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. ఏమి జరిగిందో తెలియదు కానీ ఆ స్థానానికి జనసేన పార్టీ తరఫున బెస్త సురేష్ అనే పురుష అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. అతడు నామినేషన్ వేయడమే ఒక విచిత్రం అయితే ఆ నామినేషన్ను మండల ఎన్నికల అధికారి నాసరారెడ్డి స్వీకరించడం అంతకంటే విచిత్రంగా జనం చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత సురేష్ నామినేషన్ ను తిరస్కరించడం జరిగింది. అధికారులు స్వయంగా మీడియాకు ఇచ్చిన సమాచారంలో ఈ విచిత్రం బయటపడి రచ్చయ్యింది.

అనంతపురం జిల్లాలో జనసేన అభ్యర్థి నామినేషన్ వేయగా మేమేమన్నా తక్కువా అంటూ తిరుపతి జిల్లాలో ఒక వైసీపీ అభ్యర్థి కూడా అలాగే నామినేషన్ వేసి మీడియాకు ఎక్కాడు. ఏర్పేడు మండలంలోని వికృతమాల ఎంపీటీసీ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. అక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున మునికృష్ణయ్య అనే పురుష అభ్యర్థి నామినేషన్‌ వేయడం చర్చగా మారింది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించకుండా అతడి నామినేషన్ స్వీకరించారు. తీరిగ్గా అసలు విషయం తెలుసుకొని నాలుక్కరుచుకున్నారు. మీడియా ప్రతినిధులు ఈ విచిత్రాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో నామినేషన్ల పరిశీలనలో వాటిని తిరస్కరిస్తామని అధికారులు తెలిపారు.

మొత్తం మీద ఆమెకు బదులుగా అతడి నామినేషన్ స్వీకరించడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు నామినేషన్లు వేస్తున్నారు అని కనీస పరిశీలన కూడా చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఈ లెక్కన పూర్తి స్థాయిలో నామినేషన్లను పరిశీలిస్తే ఇంకెన్ని చిత్ర విచిత్రాలు బయట పడతాయోనని మీడియా ప్రతినిధులు గుసగుసలాడుకుంటున్నారు.

This post was last modified on October 24, 2026 7:22 pm

Share

Recent Posts

నీటి కష్టాల్లో రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి…

8 minutes ago

సోనియా గాంధీ లవ్ స్టోరీ ఎంత క్యూట్ గా ఉందో!

కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా లో ప్రొఫైల్ మెయింటెన్…

39 minutes ago

ఏడ్చి ఏడిపించేసిన సుమ‌, రాజీవ్!

యాంక‌ర్ సుమ అంటే వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్. ఆమె మైక్ అందుకుందంటే న‌వ్వులే న‌వ్వులు. ఆమె ఎమోష‌న‌ల్ అవ‌డం, క‌న్నీళ్లు…

1 hour ago

నా కూతుళ్ల పెళ్ళిళ్ళు కూడా బెంగళూరు ప్యాలెస్ లో జరపను: జగన్

తన మేనకోడలు అంజిలి వివాహాన్ని తన ఉమ్మడి ఆస్తి కాంపౌండ్ లో జరపకూడదని మేనమామ జగన్ అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్న…

2 hours ago

అన్నగా ఫెయిల్.. మామగా ఫెయిల్.. సీఎంగా ఫెయిల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

తెలుగు కుర్రాళ్ల దెబ్బ… కివీస్‌ అబ్బా

టీమ్ఇండియాకు మరోసారి బ్యాటర్లే విజయాన్ని అందించారు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక…

3 hours ago