Movie News

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో ఏదో ఒక రూపంలో వైరల్ కావాలని లేదా అనుకోకుండా జరిగిన సంఘటనల ద్వారా హైప్ తెచ్చుకోవాలని చూస్తున్న దర్శక నిర్మాతలు లేకపోలేదు. ఆ మధ్య తెల్ల కాగితం పైరసీ బారిన పడి ఇంటిమేట్ సీన్లు బయటికొచ్చాయనే టాక్ బాగానే పని చేసింది. దాని వల్ల ఏమంత పాజిటివ్ జరగకపోయినా జనాల దృష్టి దాని మీదే వెళ్లేలా చేసింది.

తాజాగా ఇడుపు కాయితంకి అలాంటి అవసరం లేకుండా వివాదాలు కలిసి వస్తున్నాయి. కొన్ని వారాల క్రితం టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. సబ్ టైటిల్స్ వేస్తారా అంటూ కొందరు ఎక్స్ లో వ్యంగ్యంగా పోస్ట్ చేయడం చిన్నపాటి దుమారం రేపింది. నిన్న విడుదల చేసిన కొత్త పాటతో పాటు నిర్మాత బన్నీ వాస్ అన్న మాటలు పబ్లిసిటీకి మరింత ఉపయోగపడబోతున్నాయి. కావాలని చేయకపోయినా అలా కలిసి రావడం ముమ్మాటికీ ప్లస్సే.

తెలంగాణ వైపు పెళ్లి భోజనాల్లో నేరుగా మందుని క్యాన్లు క్యాన్లు తెచ్చి మరీ విస్తరాకుల పక్కన ప్లాస్టిక్ గ్లాసుల్లో పెట్టి పోస్తారని చూపించిన విధానం పలు విమర్శలకు దారి తీస్తోంది. అసలు మందు ముట్టనిదే తెలంగాణ సంస్కృతిలో ఏ వేడుక జరగదనే రీతిలో ఇలా పదే పదే సినిమాల ద్వారా చూపించడాన్ని సామజిక వాదులు తప్పుబడుతున్నారు. సారా తాగడం తప్పేమీ కాదని కానీ అది లేనిదే తెలంగాణ జనాలు ఉండరనే రీతిలో ఎస్టాబ్లిష్ చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బన్నీ వాస్ చేసిన కామెంట్స్ ఇంకో చర్చకు దారి తీశాయి. తెలంగాణ పల్లెలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంత పచ్చగా ఉండటం చూసి ఆశ్చర్యం కలిగిందని, వరి పండటం గురించి, గోదావరి జిల్లాలో ఉన్న ఫీలింగ్ కలగడం గురించి అన్న మాటలు వేర్వేరు అర్థాల్లో సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అమలాపురం, పాలకొల్లు ప్రస్తావన తెచ్చి పోలికలు చేయడం మరింత ఆజ్యం పోసింది. ఇవన్నీ ఎక్కడ ఆగుతాయో కానీ ఇడుపు కాయితంకి కావాల్సిన పబ్లిసిటీ అయితే చక్కగా వచ్చేస్తోంది.

This post was last modified on October 24, 2026 11:41 am

Share

Recent Posts

మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…

2 hours ago

సినిమా కోసం కాలేజీకి సెలవా?

కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…

2 hours ago

‘హనుమాన్’ను ఇబ్బందిపెట్టడంపై మహేష్ కోప్పడ్డాడా?

2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న…

3 hours ago

హను పనితనం మీద ఇన్ని కామెంట్లా

టాలీవుడ్ దర్శకుల్లో వివాదాలకు దూరంగా కాసింత ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి…

3 hours ago

రామ్ చరణ్ సరసన కొత్త అందం?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత…

4 hours ago

రాహుల్ సలహా ఆచరణ సాధ్యమేనా

రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ లో ఒక మంచి విషయం చెప్పారు. ఇకపై బిజినెస్…

5 hours ago