స్థానిక ఎన్నికలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఏదో ఒక లిటిగేషన్ సృష్టించడమే కాకుండా చీటికీ మాటికీ కోర్టుకు వెళ్లి పిటిషన్లు వేయడంతో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
స్థానిక ఎన్నికలు సకాలంలో జరగడం ఇష్టంలేని జగన్ అబద్దాలతో ఆటంకాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జగన్ పార్టీ హింస, అబద్ధాలు, అరాచకంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. వైసీపీ కార్యకర్తలు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారని, బురకాలు వేసుకునివచ్చి నామినేషన్ పత్రాలు లాక్కొంటూ మిలిటెంట్లుగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయటం అతని అజెండాలాగ కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ చర్యలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. మేము ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తుంటే జగన్ ఫేక్ ప్రచారం చేసి కోర్టులకు వెళ్తూ క్రిమినల్ లిటిగెంట్ గా మారుతున్నాడని కామెంట్ చేశారు. కోర్టులకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పారు.
స్థానిక ఎన్నికలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ క్రిమినల్ పాలిటిక్స్‌కు దిగుతున్నారని, ఇది రాష్ట్రానికే ప్రమాదమన్నారు. ఆర్థిక సంఘం నిధులు రాకుండా స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టాలన్న దురాలోచన కనిపిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారో, ఎవరు కీడు చేస్తున్నారో స్పష్టంగా తెలుసని, స్థానిక ఎన్నికల ఫలితాలు దీన్ని రుజువు చేస్తాయని చెప్పారు.
This post was last modified on October 24, 2026 3:46 pm
“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి…
చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…
రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…
కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…
2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న…
టాలీవుడ్ దర్శకుల్లో వివాదాలకు దూరంగా కాసింత ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి…