Movie News

గాడ్ ఆఫ్ వార్… త్రివిక్రమ్ తొలి పలుకులు

ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాలే తీశాడు. తన సమకాలీన దర్శకులు, తనకంటే జూనియర్లు భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీస్తూ పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోతున్నా.. ఆయన మాత్రం ఒక స్థాయికి మించి ఎదగలేకపోయారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. త్రివిక్రమ్‌కు ఉన్న పరిజ్ఞానం, ప్రతిభకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేయగలిగే సినిమాలు తీయగలరన్నది అభిమానుల నమ్మకం. ఆ దిశగా త్వరలోనే ఆయన ఒక పెద్ద అడుగు వేయబోతున్నారు.

‘గాడ్ ఆఫ్ వార్’ రూపంలో త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా మూవీని కొన్ని నెలల ముందే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు వాళ్లే కాక.. ఇతర భాషల వాళ్లూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చింది కానీ.. ఇప్పటిదాకా త్రివిక్రమ్ ఎక్కడా దీని గురించి మాట్లాడింది లేదు.

ఐతే జగపతిబాబు నిర్వహించే టాక్ షోలో త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’పై ఓపెన్ అయ్యారు. ఈ సినిమా ఎప్పుడు, దాని విశేషాలు ఏంటి అని జగపతి బాబు అడగ్గా.. ‘గాడ్ ఆఫ్ వార్’కు సంబంధించి స్క్రిప్టింగ్ చాలా వరకు పూర్తి చేసిట్లు త్రివిక్రమ్ వెల్లడించాడు. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజవ్వగానే తాను ఆ సినిమా పనుల్లోనే నిమగ్నమవుతానని, తారక్ అందుబాటులోకి రాగానే షూటింగ్ మొదలుపెడతామని త్రివిక్రమ్ చెప్పాడు. ఈ సందర్భంగా ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్‌మెంట్ పోస్టర్ మీద వేసిన ‘‘న జానామి శబ్దం న జానామి చార్థం .. న జానామి పద్యం న జానామి గద్యమ్ .. చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్’’ శ్లోకాన్ని త్రివిక్రమ్ చెప్పారు.

అంతే కాకుండా ‘‘నాకు శబ్ద జ్ఞానం లేదు. పదాల అర్థం తెలియదు. పద్యాలు రచించడం రాదు. గద్యం చెప్పడమూ రాదు. అయినప్పటికీ ఆరు ముఖాల షణ్ముఖుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. అందుకే నా నోటి నుంచి స్తోత్రాలు అనర్గళంగా వస్తున్నాయి’’ అంటూ ఆ శ్లోకం అర్థాన్ని కూడా ఆయన వివరించారు.

త్రివిక్రమ్ ఇలా ‘గాడ్ ఆఫ్ వార్’ గురించి మాట్లాడ్డం తారక్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. జూనియర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ పనిలో బిజీగా ఉన్నాడు. వచ్చే వేసవికి ఆ సినిమాను పూర్తి చేసి ఫ్రీ అవుతాడు తారక్. ఆ వెంటనే ‘గాడ్ ఆఫ్ వార్’ మొదలైపోతుందన్నమాట.

This post was last modified on October 24, 2026 4:00 pm

Share

Recent Posts

బురకాలు వేసుకునివచ్చి మిలిటెంట్లుగా వ్యవహారిస్తున్నారు

స్థానిక ఎన్నికలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఏదో ఒక లిటిగేషన్ సృష్టించడమే కాకుండా చీటికీ మాటికీ కోర్టుకు…

26 minutes ago

హనుమంతరావు మాటలకు బాధపడ్డ బాబు

“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి…

1 hour ago

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…

4 hours ago

మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…

4 hours ago

సినిమా కోసం కాలేజీకి సెలవా?

కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…

4 hours ago

‘హనుమాన్’ను ఇబ్బందిపెట్టడంపై మహేష్ కోప్పడ్డాడా?

2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న…

6 hours ago