ఏపీలో మొత్తం 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టును వైసీపీ ఆశ్రయించింది. అయితే, కేవలం 4 స్థానాల్లో మాత్రమే గడువును ఎస్ఈసీ పునేఠా పొడిగించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా, ఆధారాలు..సాక్ష్యాలు చూపించినా సరే మొట్టికాయలు వేసినా సరే…చంద్రబాబు, పునేఠా తీరు మారలేదని జగన్ విమర్శించారు. మొత్తం 19 చోట్ల గడువు పొడిగించాలని అడిగితే…కేవలం 4 చోట్ల అనుమతించారని అన్నారు.
ఇలా అయితే, ఎలక్షన్ చేయాలా..వద్దా? అని ప్రశ్నించారు. ఇదంతా ఎందుకు? నామినేషన్ పద్ధతిలో అపాయింట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని విమర్శించారు. ఎవరి కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. అక్టోబర్ 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రక్రియ వాయిదా వేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని, నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణించి..నామినేషన్లను తీసుకోవాలని చెప్పిందని అన్నారు. ఇక, పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నప్పుడు..నామినేషన్లు వేయనివ్వడం లేదంటే వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు.
ఫలానా మంచి చేశాను…అది చూసి ఓట్లు వేయాలని చంద్రబాబు అడగాలని, తాము అలా అడిగి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని అన్నారు. చంద్రబాబు తెచ్చుకున్న నిమ్మగడ్డ ఎస్ ఈసీగా ఉన్నప్పుడు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. కోవిడ్ వంటి పరిస్థితులున్నా…హామీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లామని, 86 శాతం స్థానాలు గెలుచుకున్నామని అన్నారు.
ఇక, ఫోర్జరీ సంతకాలతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. నంద్యాల మునిసిపాలిటీలో 51వ వార్డులో అభ్యర్థి నాగమణి స్క్రూటినీకి హాజరయ్యారని, నామినేషన్ స్వీకరించినట్లు అధికారులు సంతకాలు చేశారని, ఆ తర్వాత ఆమె సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ విత్ డ్రా చేశారని ఆరోపించారు. నగరిలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి విషయంలో కూడా ఇదే జరిగిందని ఆరోపణలు చేశారు. కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థుల పేరుతో దొంగ నామినేషన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. బీహార్ మాదిరి ఏపీలో జంగిల్ రాజ్,,నారాసుర రక్త చరిత్ర కొనసాగుతోందని విమర్శించారు.
This post was last modified on October 23, 2026 1:58 pm
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయినా.. తన ప్రతి సినిమా స్కేల్, కాన్వాస్, బడ్జెట్లు చాలా పెద్దవే అయినా…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను తన రాజకీయ వారసురాలిగా…
నిర్మాత బన్నీ వాస్ ఇవాళ జరిగిన ఇడుపు కాగితం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే…
రాను రాను సోషల్ మీడియా మరీ టాక్సిక్ అవుతోందని కొందరు సినీ ప్రముఖులు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది. జైలర్…
విశ్వక్ సేన్ కల్ట్ అక్టోబర్ 30 విడుదలకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబంతో పోటీ ఎందుకు లెమ్మని ఇట్లు అర్జున,…
జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి చాలా పెద్ద రిస్కు చేసిన గరివిడి లక్ష్మి రికార్డులు…