Movie News

గరివిడి గర్వంగా చెప్పుకునే విషయమిది

జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి చాలా పెద్ద రిస్కు చేసిన గరివిడి లక్ష్మి రికార్డులు బద్దలు కొట్టే ఫలితం అందుకుంటుందని ఎవరూ అనుకోలేదు కానీ ఇలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకుల అండదండలు దొరికితే చాలనుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర వీక్ డేస్ లో అనూహ్యంగా రజనీకాంత్, విజయ్ దేవరకొండలను డామినేట్ చేసే స్థాయిలో ఆనంది వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. నిన్న మొన్న ఆంధ్ర సైడ్ డెబ్భై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసిన మూవీ ఇదొక్కటే.

కాంపిటీషన్ వల్ల సరిపడా థియేటర్లు దొరకనప్పటికీ ఉన్నవాటికే జనం ఎగబడటంతో వైజాగ్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం నుంచి పర్లాకిమిడి దాకా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. గరివిడి లక్ష్మి గురించి సీడెడ్ లో అవగాహన తక్కువ కాబట్టి వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. నైజామ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ జైలర్ 2, రణబాలి డామినేట్ చేస్తున్నాయి. ఈ వారం 418 హారర్ మూవీ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇంకో వీకెండ్ అడ్వాంటేజ్ దక్కనుంది.

మొత్తానికి గరివిడి లక్ష్మి గర్వంగా చెప్పుకునే ఘనత అయితే సాధించింది. దర్శకుడు గౌరీ నాయుడు, రాగ్ మయూర్, ఆనంది విస్తృతంగా చేసిన ప్రమోషన్లు బాగా ఉపయోగపడ్డాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి బహుశా అవార్డులు తెచ్చే సినిమా ఇదే అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయట ప్రపంచానికి తెలియాల్సిన లక్ష్మి లాంటి కథలు మరికొన్ని తెరమీదకు రావాల్సిన అవసరం చాలా ఉంది. వీటి వల్ల టాలెంట్ ఉన్న ఎందరికో స్ఫూర్తి దక్కుతుంది.

థియేటర్ రన్ ఇంకో వారం పది రోజులు కొనసాగించనున్న గరివిడి లక్ష్మి ఓటిటిలో వచ్చాక భారీ వ్యూస్ సొంతం చేసుకోవడం ఖాయం. డీల్ ముందే అయిపోవడం వల్ల దసరాకు విడుదల చేశారని టాక్. అయితే పబ్లిసిటీ పరంగా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఉంటే బాగుండేదని డిస్ట్రిబ్యూటర్ వర్గాల అభిప్రాయం. మరింత జనాలకు చేరువయ్యేదని, అయినా సరే ఇప్పటిదాకా సాధించిన వసూళ్లు చూస్తే ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. కొందరు బయ్యర్లకు ఇది లాభాల పంట పండించనుంది.

This post was last modified on October 23, 2026 5:29 pm

Share

Recent Posts

బొత్స వార‌సురాలి ఫ్యూచ‌రేంటి?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను తన రాజకీయ వారసురాలిగా…

1 hour ago

భయపెట్టడం కాదు నిజాలు మాట్లాడారు

నిర్మాత బన్నీ వాస్ ఇవాళ జరిగిన ఇడుపు కాగితం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే…

1 hour ago

పోలికల పంచాయితీలు ఆపేస్తే బెటర్

రాను రాను సోషల్ మీడియా మరీ టాక్సిక్ అవుతోందని కొందరు సినీ ప్రముఖులు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది. జైలర్…

2 hours ago

కల్ట్‌కు వచ్చే అసలు కష్టం అదే

విశ్వక్ సేన్ కల్ట్ అక్టోబర్ 30 విడుదలకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబంతో పోటీ ఎందుకు లెమ్మని ఇట్లు అర్జున,…

2 hours ago

వైసీపీ అభ్యర్థుల సంతకం ఫోర్జరీ

ఏపీలో మొత్తం 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టును వైసీపీ ఆశ్రయించింది. అయితే, కేవలం 4 స్థానాల్లో…

6 hours ago

పెద్ద నిర్మాతలు పెద్ద మనసు చేసుకోలేరా

టాలీవుడ్ లో ఇప్పుడో టాపిక్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పెద్ద హీరోల సినిమాలు పదే పడే వాయిదా వేసుకోవడం…

7 hours ago