Political News

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అగ్రవర్ణాలలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నవారు కూడా కేవలం రిజర్వేషన్లు లేవన్న కారణంతో అవకాశాలు కోల్పోతున్న వైనంపై నెటిజన్లు, కొందరు విద్యావేత్తలు, మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక, ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ గతంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకూ విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేయాలని గతంలోనే ఆదేశించింది. అయితే, ఈ రిజర్వేషన్లు మాత్రం తెలంగాణలో అమలు కాకపోవడంపై విమర్శలు వచ్చాయి.

దీంతో, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు కూడా తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆల్రెడీ తెలంగాణలో బలహీన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్లకు ఈ 10 శాతం రిజర్వేషన్లు అదనమని చెప్పారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలుపుకొని తెలంగాణలో రిజర్వేషన్ల శాతం 60కు చేరుకుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించిన విధివిధానాలు, నియమనిబంధనలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో, రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం తెచ్చిన 10% రిజర్వేషన్లను ఇకపై తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారని విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on January 22, 2021 10:54 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

6 mins ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

2 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

3 hours ago

అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి

ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…

4 hours ago

మా మామ నీచుడు-నికృష్టుడు: అంబ‌టి అల్లుడు

ఏపీలో రాజ‌కీయాలు ఊపందుకున్న నేప‌థ్యంలో సంచ‌ల‌నాలు కూడా అదే రేంజ్‌లో తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌ధాన పార్టీల‌న్నీ కూడా.. పెద్ద…

4 hours ago

నోటి ‘దురుసు’ తీరుస్తుందా ?!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…

5 hours ago