క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏడాదిన్నర పాటు కొత్త వ్యవసాయచట్టాల అమలును నిలిపేసేందుకు సిద్ధమంటు కేంద్రం తాజాగా చేసిన ప్రతిపాదన తర్వాత రైతుసంఘాల ఒత్తిడి లొంగినట్లే అనిపిస్తోంది. కేంద్రం కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కార్పొరేట్ సంస్ధల ప్రయోజనాల కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను చేసిందన్నది రైతుసంఘాల ప్రధాన ఆరోపణ.
రైతుల ఆరోపణలకు సరైన సమాధానం చెప్పుకోలేని కేంద్రం వ్యవసాయ చట్టాల రద్దు మాత్రం కుదరదని తెగేసి చెప్పింది. వ్యూహాత్మకంగా ఇప్పటికి తొమ్మిదిసార్లు చర్యల పేరుతో కాలయాపన చేసింది. కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా రైతుసంఘాలు మాత్రం లొంగలేదు. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో సింఘూ వద్ద దాదాపు 59 రోజుల క్రితం మొదలుపెట్టిన ఉద్యమం అంతకంతకు పెరుగుతునే ఉంది. జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత సుప్రింకోర్టు రంగంలోకి దిగింది.
సుప్రింకోర్టు రంగంలోకి దిగి చట్టాల అమలుపై స్టే విధించటమే కేంద్రానికి పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎన్డీయేతర పార్టీలు కూడా కొత్త వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. అదే రోజు వేలాది ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన చేయాలని రైతుసంఘాలు తీర్మానించాయి. ఇప్పటికే సింఘు ప్రాంతంలో రోజుకు వేలాది మంది రైతులు దీక్షల్లో కూర్చుంటున్నారు.
ట్రాక్టర్ల ప్రదర్శనను సుప్రింకోర్టు అడ్డుకుంటుందని కేంద్రం భావించింది. అయితే దాన్ని పోలీసులే చూసుకోవాలని తేల్చేసింది. దాంతో కేంద్రానికి ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఇటువంటి పరిస్ధితుల్లో మొండిగా ముందుకెళితే రేపు జనవరి 26వ తేదీన ట్రాక్టర్ల ప్రదర్శనలో జరగరానిది ఏమైనా తలెత్తే పరిణామాలను కేంద్రం అంచనా వేసుకున్నట్లుంది. దాంతో అన్నీ వైపుల నుండి పెరిగిపోతున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక చివరకు ఏడాదిన్నరపాటు కొత్త చట్టాల అమలును వాయిదా వేయబోతున్నట్లు ప్రతిపాదించింది.
అయితే ఈ ప్రతిపాదనకు రైతుసంఘాలు ఎగిరిగంతేమీ వేయలేదు. రైతుసంఘాల నేతలు సమావేశమై చర్చించుకుని ఏ సంగతి చెబుతామని కేంద్రానికి సమాదానమిచ్చాయి. తాము ప్రకటన చేసినట్లుగానే సుప్రింకోర్టులో ఓ అఫడివిట్ కూడా దాఖలు చేయటానికి రెడీగా ఉన్నట్లు కేంద్రమంత్రులు రైతుసంఘాలతో స్పష్టంగా చెప్పారు. అయితే ఎందుకో రైతుసంఘాలకు కేంద్రంపై నమ్మకం కుదరటం లేదు. పైకి ఒకటి చెప్పి లోలోపల మరొటి చేస్తుందేమో అన్న అనుమానాలు ఇంకా రైతుసంఘాలను వదలటం లేదు. మరి 22వ తేదీన జరగబోయే చివరి సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on January 21, 2021 4:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…