చైనా దౌర్జన్యాలకు, దురాక్రమణలకు ఇది మరో నిదర్శనం. సరిహద్దు వెంబడి ఏదో ఒక నీతి మాలిన పని చేస్తూ భారత్‌ను నిరంతరం కవ్విస్తూ ఉండే డ్రాగన్ కంట్రీ.. మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకుంది. భారత భూభాగంలో ఆ దేశం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి మన దేశానికి సవాలు విసిరింది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భూభాగం తమదే అని వాదించే చైనా.. తాజాగా అక్కడ ఓ గ్రామాన్నే నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల దూరం భారత భూభాగంలోకి చొరబడి చైనా సైన్యం ఈ గ్రామాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారి చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.
ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి. గత ఏడాది నవంబరు 20న తీసినట్లుగా చెబుతున్న ఉపగ్రహ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ భద్రత గురించి ఘనంగా ప్రకటనలు చేసే ప్రధాని నరేంద్ర మోడీ.. చైనా సైన్యం వచ్చి మన భూభాగంలో ఒక గ్రామాన్నే నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
నరేంద్ర మోడీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అని.. చైనా మన భూభాగంలో గ్రామం నిర్మించడం చూస్తే షీ జిన్ పింగ్‌కు మోడీ సర్కారు ప్రత్యేక ఆవాస్ యోజన కల్పించినట్లు ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు. మరి ఈ వ్యవహారంపై మోడీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on January 19, 2021 9:45 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…