అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాషింగ్టన్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈనెల 20వ తేదీన బైడెన్ వైట్ హౌస్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. సుమారు 10 రోజుల క్రితం అమెరికా పార్లమెంటు క్యాపిటల్ బిల్డింగ్ పై కొన్ని వందలమంది ఒక్కసారిగా దాడులు చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే. తర్వాత వారిలో అత్యధికులను అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులుగా గుర్తించారు. దాంతో అమెరికా మొత్తం ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.
ఈనెల 20వ తేదీన వైట్ హౌస్ మీద కూడా ఎవరైనా దాడులు జరిపే ప్రమాదం ఉందని అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా వైట్ హౌస్ చుట్టుపక్కల భారీ బందోబస్తు పెట్టారు. అలాగే వాషింగ్టన్ నగరంలోకి రాకపోకల మీద కూడా నిషేధం విధించారు. వాహనాలను చెక్ చేయకుండా ఎవరినీ లోపలకు అనుమతించటం లేదు. ఇటువంటి చెకింగ్ లో ఓ వ్యక్తి దగ్గర నుండి తుపాకి, 500 రౌండ్ల బుల్లెట్లు పట్టుబడటంతో యావత్ అమెరికా ఉలిక్కిపడింది.
తుపాకి, బుల్లెట్లతో పట్టుబడిన వ్యక్తిని వర్జీనియా రాష్ట్రానికి చెందిన వెస్లీ బాలర్ గా పోలీసులు గుర్తించారు. భద్రతాధికారుల కళ్ళుకప్పి బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో హాజరవ్వటానికి వెస్లీ వాషింగ్టన్ కు చేరుకున్నట్లు సమాచారం. అతని దగ్గర ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పాస్ కూడా దిరికింది. దాంతో పోలీసులు, వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అతని దగ్గర దొరికిన పాస్ ను జాగ్రత్తగా గమనిస్తే అది నకిలీదని తేలిపోయింది. అంటే ఇలాంటి పాసులు తీసుకుని ఇంకెమంది ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవబోతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామందే ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బెడైన్ను అధ్యక్షునిగా ప్రమాణం చేయనిచ్చేది లేదని ఇప్పటికే ట్రంప్ మద్దతుదారులు హెచ్చరించటం, ముందుగా హెచ్చరించినట్లే తాజాగా ఓ వ్యక్తి నకిలీ పాస్ తో వాషింగ్టన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించటం, తుపాకితో పాటు 500 రౌండ్లబుల్లెట్లు దొరకటంతో అధ్యక్షుని భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులు హై అలెర్టు ప్రకటించారు. ప్రమాణస్వీకారం రోజున ఎవరు ఏమూల నుండి దాడులు చేస్తారో తెలీక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on January 18, 2021 10:56 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…