Political News

ఎవ‌రా ‘ఉత్త‌రాంధ్ర నేత‌’.. వైసీపీలో హాట్ టాపిక్‌

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తాజాగా వైసీపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ నేత‌.. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో ఎవ‌రా నేత‌? అంటూ.. వైసీపీలోనే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా.. పెద్ద ఎత్తున ఈ విష‌యం చ‌ర్చ‌కు దారితీసింది. ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌స్తుతం బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న‌ది బొత్స స‌త్య‌నారాయ‌ణ మాత్ర‌మే. ప్ర‌స్తుతం ఆయ‌న మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడిగా ఉన్నారు.

ఆయ‌న కుటుంబం కూడా.. రాజ‌కీయాల్లో యాక్టివ్‌గానే ఉంది. బొత్స ఝాన్సీ, ఆయ‌న కుమార్తె అనూష‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే.. వైసీపీలో బొత్స కీల‌క రోల్ పోషిస్తున్నా.. ఆయ‌న‌కు ఆమేర‌కు త‌గిన గౌర‌వం ల‌భించ‌డం లేద‌న్న వాద‌న ఉంది. దీనికితోడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో బొత్స‌కు అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి. గ‌తంలో అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంంలో స‌భ ముందు.. బొత్స‌-ప‌వ‌న్ ప‌ర‌స్ప‌రం ఎదురు ప‌డిన‌ప్పుడు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకున్నారు. కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. ఆరు మాసాల కింద‌ట బొత్స‌కు అనారోగ్యం చేసిన‌ప్పుడు ప‌వ‌న్ ప‌ల‌క‌రించారు.

ఈ నేప‌థ్యంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. పార్టీ మారే అవ‌కాశం ఉందా? అనే విష‌యంపై వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది. ఈయ‌న ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నాయ‌కుడు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికారంలో ఉన్పప్పుడు.. విజ‌య‌న‌గ‌రం జిల్లాను ఏక‌ఛత్రాధిప‌త్యంగా ఏలార‌న్న వాద‌న ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా.. మంత్రిగా కూడా బొత్స త‌న‌దైన ముద్ర వేశారు. అయితే.. వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత.. రాజ‌కీయంగా ప్రాబ‌ల్యం ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న పేరు, ప‌ర‌ప‌తి త‌గ్గుముఖం ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వ‌మేన‌ని.. ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. విధి లేని ప‌రిస్థితిలో కొన‌సాగుతున్నార‌న్న మాట కూడా త‌ర‌చుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, బొత్స‌ను ప‌క్క‌న పెడితే.. ఇత‌ర నాయ‌కులు.. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, గ‌డివాడ అమ‌ర్నాథ్‌, దువ్వాడ శ్రీనివాస్‌, మాజీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ వంటివారు ఉత్త‌రాంధ్ర వైసీపీ నాయ‌కులుగా చెలా మ‌ణి అవుతున్నా.. వారికి ఇత‌ర పార్టీల‌లో అంత ఇమేజ్ లేదు. పైగా.. వారికి, ఇత‌ర పార్టీల‌కు మ‌ధ్య దూరం కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.. ఉత్త‌రాంధ్ర నేత‌ వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నార‌న్న కామెంట్‌.. బొత్స ఫ్యామిలీకి సంబంధించే అయి ఉంటుంద‌న్న చ‌ర్చ రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. అయితే.. దీనిపై క్లారిటీ లేదు. అటు బొత్స అయినా.. ఇటు ఇత‌ర నేత‌లైనా స్పందిస్తే త‌ప్ప‌.. స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం లేదు.

This post was last modified on August 29, 2026 9:23 pm

Share

Recent Posts

ఒక్క విషయంలో ఇరుముడికి అపోజిషన్

ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…

1 hour ago

ఆ ఒక్క ఫోటో ఆమె కేరీర్ ను దెబ్బతీసింది

సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…

1 hour ago

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు….

బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…

2 hours ago

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

3 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

5 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

5 hours ago