ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను నేరుగా కలుసుకుని విజ్ఞాపనలు చేసే వారు కొందరు అయితే.. ఆయనను కలుసుకోకుండా కేవలం లేఖ ద్వారా సమస్యలు ప్రస్తావించేవారు మరికొందరు. సమస్య ఏదైనా విజ్ఞాపన ఎలాంటిదైనా.. తన దృష్టికి వస్తే.. దానిని తీర్చే వరకు నిద్రపోనితత్వం పవన్ కల్యాణ్‌ది. తాజాగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన ప్రజలు చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిపై పవన్ కల్యాణ్ ఆఘమేఘాలపై స్పందించారు.
ఏంటి సమస్య..?
విశాఖపట్నంలోని రాంబిల్లి మండలం, కృష్ణంపాలేనికి చెందిన గ్రామస్తులు సుదర్ఘ కాలంగా ఇక్కడి పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఇక్కడి ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. కానీ, అప్పట్లో ఎవరూ వీరి బాధను వినిపించుకోలేదు. కాగా.. తాజాగా తన నియోజకవర్గం కాకపోయినా.. కాలుష్యం సమస్య ఉందని చెప్పగానే.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను తక్షణమే అక్కడ పర్యటించాలని ఆదేశించారు.
దీంతో హుటాహుటిన విశాఖపట్నంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాంబిల్లికి చేరుకున్నారు. ఇక్కడి `బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్` పరిశ్రమలో తనిఖీలు చేశారు. యంత్రాలను పరిశీలించారు. కాలుష్య కారక వాయువుల పరిస్థితిని తెలుసుకున్నారు. వెంటిలేటర్ల ద్వారా వస్తున్న కాలుష్య వాయువులు.. చుట్టపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న మాట వాస్తవమేనని గ్రహించారు. ఆ వెంటనే బాయిలర్ చిమ్నీకి మల్టీ సైక్లోన్ డస్ట్ కలెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు.. డస్ట్ కలెక్టర్ ఏర్పాటు చేసే వరకు పరిశ్రమలో కార్యకలాపాలను నిలిపి వేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం తాము పరిశీలించి.. సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమకు తాజాగా తాళాలు వేశారు. ఈ చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యను చిన్న లేఖ ద్వారా తెలియజేయడంతో వెంటనే పరిష్కరించారని కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on August 29, 2026 8:35 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…