Political News

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన ఆయ‌న‌.. ఇప్పుడు పొరుగు దేశం.. పైగా ద‌శాబ్దాలుగా మిత్ర దేశంగా కూడా  ఉన్న కెన‌డాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ దేశంపై ఇప్ప‌టికే 50 శాతం అద‌న‌పు సుంకాలు విధించారు. ఈ క్ర‌మంలో మేం మాత్రం త‌క్కువా అంటూ.. కెన‌డా కూడా.. అమెరికాపై 20 శాతం చొప్పున అద‌న‌పు సుంకాల‌ను విధించింది. ఇలా ఇరుగు పొరుగు దేశాలు క‌వ్వించుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలో తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. అమెరికా-కెన‌డా స‌రిహధ్దుల్లోని కీల‌క‌మైన మంచినీటి స‌ర‌స్సు.. `లేక్ ఆంటారియో` పేరును మారుస్తూ.. అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు కూడా జారీ చేసేశారు. వాస్త‌వానికి రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లోని ప్రాంతాల పేర్లు మార్చేందుకు.. కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌పాలి. స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు చెందిన రాష్ట్రాల ప్ర‌తినిధులు, గ‌వ‌ర్న‌ర్ల‌తోనూ చ‌ర్చించాలి. కానీ, ఇవేవీ త‌న‌కు ప‌ట్ట‌న‌ట్టుగా ట్రంప్ ఆక‌స్మిక నిర్ణ‌యం తీసుకుని.. లేక్ ఆంటారియో పేరును లేక్ అమెరికాగా మార్చేయ‌డం గ‌మ‌నార్హం.

న్యూయార్క్ స‌హా..

ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంపై కెన‌డా నిప్పులు చెరిగింది. ఇదేం ప‌ద్ధ‌తి అంటూ నిల‌దీసింది. లేక్ ఆంటారోయో అమెరికాకు మాత్ర‌మే సొంతం కాద‌ని పేర్కంది. దీనిపై అంత‌ర్జాతీయ ఒడంబ‌డిక కూడా ఉంద‌ని కెన‌డా పేర్కొంది. దౌత్య‌ప‌ర‌మైన సంబంధాలు మ‌రింత బ‌ల‌హీనప‌రిచే ఉద్దేశంతోనే ట్రంప్ ఇలా చేస్తున్నార‌ని మండి ప‌డుతున్నారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై న్యాయార్క్ గ‌వ‌ర్న‌ర్ సైతం విస్తుబోయారు. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము అమ‌లు ప‌ర‌బోమ‌ని హోచుల్ తెగేసి చెప్పారు.

నెటిజన్లు కూడా..

ట్రంప్ నిర్ణ‌యంపై సామాజిక మాధ్య‌మంలోనూ విమ‌ర్శ‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయి. ట్రంప్‌కు మ‌తి భ్ర‌మించింద‌ని కాంగ్రెష‌న‌ల్ కార్య‌క‌ర్త‌లు(విప‌క్షం) పేర్కొన్నారు. విద్యార్థులు సైతం.. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక‌, రిప‌బ్లిక‌న్ ప్ర‌జాప్ర‌తినిధులు మాత్రం ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 28, 2026 6:27 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

9 minutes ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

25 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago