కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ టర్న్డ్ పొలిటీషియన్ బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అర్థం కాదు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరి కొంత కాలం హడావుడి చేసిన బండ్ల.. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం తర్వాత రాజకీయాలకు టాటా చెప్పేశాడు.
ఈ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసి మాయమైన బండ్ల.. ఇప్పుడు సినిమాల్లోనూ అంత యాక్టివ్‌గా లేడు. కానీ ట్విట్టర్లో మాత్రం అతను చాలా చురుగ్గా ఉంటాడు. ఎక్కువగా టాలీవుడ్ బడా స్టార్ల భజనలో మునిగి తేలే బండ్ల.. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆకాశానికెత్తేస్తూ ట్వీట్లు వేస్తున్న సంగతి తెలిసిందే.
పనిలో పనిగా ఇటీవల ఆంధ్రా రాజకీయ నాయకులపై విమర్శలు కూడా గుప్పించి ఆశ్చర్యపరిచాడు. తాజాగా బండ్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ను టార్గెట్ చేయడం గమనార్హం.
తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ నిలవకపోవడం పట్ల బండ్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేశాడు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నా ధైర్యంగా పోరాడుతున్నారని.. వైఎస్ జగన్ సైతం తండ్రి మరణానంతరం అందరూ కలిసి తనను అణచివేయాలని చూసినా వాళ్లందరినీ ఎదిరించి 9 సంవత్సరాలు పోరాడి విజయం సాధించాడని.. కానీ లోకేష్‌ను చూస్తే మాత్రం అతను రాజకీయాల్లో పట్టు సాధించలేరని భయం వేస్తోందని.. అతను నంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని బండ్ల అన్నాడు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ లాగా.. చిరంజీవి కొడుకు రామ్ చరణ్‌లా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవాలని నారా లోకేష్‌ను కోరాడు బండ్ల.
మొన్నీ మధ్య టీటీడీ ఛైర్మ్ స్వామి వారి దర్శనం చేసుకుని బయటికి వస్తే లోకేష్ చేసిన ట్వీట్ ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లిన బండ్ల.. లోకేష్ ఇటీవల చేస్తున్న ట్వీట్లు చూసి అతణ్ని అభిమానించే వాళ్లు బాధ పడుతున్నారని అన్నాడు.
తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. ఐతే చంద్రబాబు అన్నా, ఎన్టీఆర్ అన్నా ఉన్నా అభిమానంతో ఇలా మాట్లాడుతున్నానని ట్వీట్ చేశాడు బండ్ల. చంద్రబాబు కుమారుడిగా తప్ప రాజకీయంగా నారా లోకేష్‌కు అర్హత లేదని.. తనకు తెలిసి లోకేష్ ఫెయిల్యూర్ లీడర్ అని తేల్చేశాడు బండ్ల. ఐతే ఉన్నట్లుండి అతను నారా లోకేష్ ను ఇలా ఎందుకు టార్గెట్ చేశాడన్నది అర్థం కాని విషయం.
This post was last modified on May 5, 2020 5:49 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…