తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఇన్ని నెలల తర్వాత ఆయనకు తన ఓటమిపై డౌట్ వ్యక్తమైంది. తాను ఓడిపోనని.. తనకు ప్రజలు అండగా ఉన్నారని.. కానీ, ఏదో తేడా కొట్టిందని అందుకే లెక్కలు తప్పాయని స్టాలిన్ ఆరోపించారు. ఈ క్రమంలో తిరిగి ఓట్లను లెక్కించాలని స్టాలిన్ కోరుతున్నారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో స్టాలిన్ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
కొళత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ వరుస విజయాలు దక్కించుకున్నారు. అయితే.. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గతంలో వీఎస్ బాబు అనే నేతకు అత్యంత అనుకూలం. ఆయన డీఎంకేలోనే కొనసాగేవారు. నిజానికి డీఎంకే నేతగా స్టాలిన్.. తొలిసారి ఎన్నికల్లో దిగిన సమయంలో బాబు తను పోటీ నుంచి తప్పుకొని స్టాలిన్‌కు మార్గం సుగమం చేశారు. ఈ విషయాన్ని స్టాలిన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రతి ఎన్నికలోనూ బాబు కనుసన్నల్లోనే స్టాలిన్ విజయం దక్కించుకుంటు న్నారు. కాగా.. తన స్థానాన్ని స్టాలిన్‌కు ఇచ్చినా.. ఏమాత్రం గౌరవంగా చూడడం లేదని ఆరోపించిన బాబు.. ఈ ఏడాది అనూహ్యంగా తన పార్టీని మార్చేసుకున్నారు.
టీవీకే అధినేత సీఎం విజయ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరిపోయారు. అనంతరం.. టీవీకే గుర్తుపైనే ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అటు బాబు ఇటు స్టాలిన్ ఇరువురూ పోటీ పడ్డారు. ఈ క్రమంలో బాబు 9 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం.. స్టాలిన్.. బాబును అభినందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానంటూ.. ఆయన ఎన్నికల ఫలితం వచ్చిన మర్నాడే కొళత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు. అంతా అయిపోయి.. దాదాపు 5 మాసాలు గడిచిపోయాయి. అయితే.. తాజాగా స్టాలిన్‌కు అనుమానం రేగింది. తాను ఓడిపోలేదని.. వీవీపాట్‌లలో అవకతవకలు జరిగాయని.. అందుకే ఇక్కడ ఓట్లను మరోసారి లెక్కించాలని కోరుతూ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇవీ స్టాలిన్ ఆరోపణలు
+ ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయి.
+ ఈవీఎం, వీవీపాట్ ప్రక్రియలలో లోపాలు తలెత్తాయి.
+ ఓట్ల రీకౌంటింగ్ జరపాలి.
+ వరుసగా మూడు సార్లు గెలుస్తున్న నన్ను ఇక్కడి ప్రజలు ఓడించే అవకాశమే లేదు.
+ నియోజకవర్గానికి ఎన్నో చేశాను.
This post was last modified on August 24, 2026 10:19 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…