మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్ మమిత బైజు ఇందులో కూడా వయసు వ్యత్యాసం ఉన్న హీరోని ప్రేమించే క్యారెక్టర్ లో మరోసారి బెస్ట్ ఇచ్చేసింది. అయితే ఇందులో ఏజ్ డిఫరెన్స్ కేవలం పదేళ్లకే పరిమితం చేశారు. ప్రేమలు తీసిన గిరీష్ ఏడి దర్శకత్వం వహించిన ఈ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ వాలా 2 లాగే త్వరగా వంద కోట్ల మార్కుకు చేరుకుంటుందని ట్రేడ్ అంచనా.
ఇప్పుడీ బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు డబ్బింగ్ సెప్టెంబర్ 4 విడుదల చేయబోతున్నారు. నిజానికి ఒక అగ్ర నిర్మాణ సంస్థ రీమేక్ చేయాలని ప్లాన్ చేసిందట. కాకపోతే కథలో ఉన్న సున్నితత్వం మన ప్రేక్షకులకు మ్యాచ్ అవ్వదేమోననే ఉద్దేశంతో ఆ ఆలోచన మానుకున్నారట. సో అనువాదం చేసుకుంటే రిస్క్ తగ్గుతుంది కాబట్టి ఆ దిశగా వెళ్తున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ కన్నా రెండు వారాలు ఆలస్యంగా తేవడం వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుందా అనేది డౌటే.
అసలు బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ అనే టైటిల్ లోనే మన నేటివిటీ పూర్తిగా మిస్ అవుతోంది. ఒకపక్క ఇరుముడి యమా స్ట్రాంగ్ గా ఉంది. టాక్సిక్ ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రెండో వారంలోనూ హోల్డ్ ఉంటుంది. విశ్వనాధ్ అండ్ సన్స్ అప్పటికీ కొనసాగే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనకను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకొస్తోంది. వీటి మధ్యలో కేవలం మమిత బైజు ఇమేజ్ ని నమ్ముకుని ఓపెనింగ్స్ సాధించాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లలో ప్రేమలు లాంటి ఒకటి రెండు సినిమాలు తప్ప మల్లువుడ్ డబ్బింగులు మన దగ్గర వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. ఓటిటిలో విపరీతంగా చూస్తారు కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి మనవాళ్ళు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. పైగా ఇంత కాంపిటీషన్ ఎదురుగా ఉన్నప్పుడు. వేన్నీళ్ళకు చల్లనీళ్లు తోడు అన్నట్టు ఎంతో కొంత వస్తే చాలని ట్రై చేస్తున్నట్టు ఉన్నారు. రిలీజ్ ఖర్చులు, మార్కెటింగ్ తప్ప వీటికి పెద్దగా వ్యయం కూడా కాదు. ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on August 24, 2026 9:44 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…