Political News

మీరైనా న్యాయం చేయండి: రాష్ట్ర‌ప‌తికి వివేకా కుమార్తె లేఖ‌

“మేడమ్‌.. మీరైనా నాకు న్యాయం చేయండి.“ అంటూ 2019లో దారుణ హ‌త్య‌కు గురైన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత తాజాగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముకు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌, సీఎం చంద్ర‌బాబుకు కూడా ఆమె పంపారు. ఈ లేఖ‌లో 2019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వివేకా దారుణ హ‌త్య‌పై జ‌రిగిన విచార‌ణ‌లు.. తాను ఎన్నిసార్లు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించిందీ.. స‌మ‌గ్రంగా వివ‌రించారు.

ఇదే స‌మ‌యంలో వివేకా హ‌త్య‌కు సంబంధించి `తొలి స‌మాచారం` జ‌గ‌న్‌కు రావ‌డం వెనుక ఉన్న రీజ‌నేంట‌నేది తెలియాల్సిన అవ‌స‌రం కుమార్తెగా త‌న‌కు ఉంద‌న్నారు. త‌న తండ్రి దారుణ హ‌త్య‌పై లోతైన విచార‌ణ చేయ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. జ‌గ‌న్‌ను విచారించాల్సి ఉంద‌ని గ‌తంలో సీబీఐ త‌న అఫిడ‌విట్ లోనే పేర్కొంద‌న్న సునీత‌.. కానీ, త‌ర్వాత ఆయ‌న‌ను క‌నీసం ముట్టుకోలేద‌ని పేర్కొన్నారు. ఆయా విష‌యాల‌పై త‌గు న్యాయం చేయాల‌ని.. ఓ మ‌హిళ‌గా, అమ్మ‌గా త‌న ఆవేద‌న‌ను అర్ధం చేసుకోవాల‌ని సునీత త‌న లేఖ‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కోరారు.

లేఖ‌లోని ముఖ్యాంశాలు ఇవీ..

+ వివేకా హ‌త్య కేసులో మూడు కీల‌క అంశాలు ఉన్నాయి. 1) ఆయుధం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. 2) డీల్ చేసుకున్న‌ సొమ్ములు ఎవ‌రి ద్వారా వ‌చ్చాయి. 3) కుట్ర కోణం ఏంటి. ఈ మూడు అంశాలే ఈకేసులో కీల‌కం. అయితే..వీటిపై లోతైన ద‌ర్యాప్తు చేయ‌డం లేదు. నేను(సునీత‌) అనేక కోర్టుల‌ను ఆశ్ర‌యించింది కూడా వీటి కోస‌మే. కానీ, నేర తీవ్ర‌త గురించి స‌మ‌గ్ర విచార‌ణ చేయ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రించే హోం శాఖ అధికారి ద్వారా మ‌రోసారి ద‌ర్యాప్తు చేయించాలి.

+ న్యాయం కోసం.. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా. మానాన్న చనిపోయిన‌ప్పుడు తొలి ఫోన్ జ‌గ‌న్‌కే వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సీబీఐ కూడాత‌న అఫిడ‌విట్‌లో స్ప‌ష్టం చేసింది. కానీ, ఆయ‌న‌ను విచారించ‌డం ల‌దేఉ. మానాన్న‌ మరణవార్త మొదట ఎలా బయటకు వచ్చిందనేది కేసుకు కీలకం. లోతైన దర్యాప్తు చేయాల‌న్న నా అభ్య‌ర్థ‌ను విచార‌ణ కోర్టు(హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టు) పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో ఎవ‌రి పాత్ర ఉన్నా.. వాస్తవాలు బహిర్గతమయ్యేలా చూడాలి. ఈ దారుణంలో జగన్‌ పాత్రను విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఆయ‌న‌ను విచారించాలి. కానీ, ఈ దిశ‌గా ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం లేదు. 

This post was last modified on August 9, 2026 9:05 am

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

27 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

31 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

1 hour ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

2 hours ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago