మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఎంత ఆగ్రహం పేరుకుపోతోందో తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలిచింది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా హర్యానా ప్రభుత్వం కర్నల్ జిల్లాలోని కైమ్లాలో సభ నిర్వాహించాలని డిసైడ్ అయ్యింది. దీనికి ముఖ్య అతిధిగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హాజరవ్వాల్సుంది. భారీ సభకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయితే ఊహించని మలుపుతో మొత్తం సభ రద్దయిపోయింది.
ఇంతకీ ఏమి జరిగిందంటే కైమ్లాలో సభ జరుగుతోందని తెలుసుకున్న రైతుసంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామంలోకి వారిని పోలీసులు అనుమతించలేదు. దాంతో పెద్దఎత్తున గొడవలు జరిగింది. రైతులపైకి పోలీసులు జలఫిరంగులను, భాష్పావాయువుని ప్రయోగించినా రైతులు లొంగలేదు. పోలీసులను ఛేదించుకుని రైతులు పోలోమంటూ సభ జరిగే ప్రాంతానికి చొచ్చుకుపోయారు.
సభా ప్రాంగణంలో వేసిన కుర్చీలను విరగ్గొట్టేశారు. అలాగే వేదికను పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఇది సరిపోదన్నట్లుగా ఖట్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ ను కూడా రైతులు స్వాధీనం చేసుకున్నారు. రైతుల ఆగ్రహం దెబ్బకు చివరకు పోలీసులే తోకముడవాల్సొచ్చింది. జరిగిందంతా తెలుసుకుని చివరకు ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి హింసాత్మక ఘటనగా దీన్ని చెప్పుకోవాలి.
ఒకసారంటూ ఘటనలు మొదలైతే ఇక ఇతర ప్రాంతాలకు పాకటానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పటికే పంజాబులో వేలాది రైతులు అంబానీ, అదానీల వ్యాపార సముదాయాల మీద, జియో టవర్ల మీదపడి ధ్వంసం చేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. ఒక్క పంజాబులో మాత్రమే 1500 జియో టవర్లు ద్వంసం అయిపోయాయి. రైతుల ఉద్యమఫలితంగా వీళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ముందు ముందు కైమ్లా ఘటనలు ఇతర ప్రాంతాల్లో రిపీట్ కాకుండా ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాయో చూడాల్సిందే. సరే ఎలాగూ సందట్లో సడేమియా లాగ ప్రతిపక్షాలు ఎలాగూ దీన్ని క్యాష్ చేసుకునేందుకు చూస్తాయి కదా అదే పనిలో ఉన్నాయి.
This post was last modified on January 11, 2021 2:29 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…