రాజకీయాల్లో వారసులకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అయితే.. ఒకే కుటుంబం నుంచి వరుస పె ట్టి.. నాయకులుగా రంగ ప్రవేశం చేయడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకరు కాదు. ఇద్దరుకాదు.. ఏకంగా ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
వారే.. విజయ నగరం జి ల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం. సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ, తమ్ముడు బొత్స అప్పలనరసయ్య, మేనల్లుడు, ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పల నాయుడు మొత్తంగా ఇప్పటి వరకు ఈ నలుగురు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా వీరి హవానే నడుస్తోంది. వీరు ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. జిల్లాలో మాత్రం ఆధిపత్యం బొత్స కుటుంబానిదే. వ్యాపారాలు, కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్నీ కూడా బొత్స కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉన్నాయనేది బహిరంగ రహస్యం.
ఇక, ఇప్పుడు బొత్స తన తన యుడు సందీప్ బాబును కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. వైద్య విద్యను అభ్యసించిన సందీప్.. ప్రస్తుతం విశాఖలో వైద్య వృత్తిలో ఉన్నారు. కానీ, ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. త్వరలోనే ఆయన రాజకీయ రంగంలోకి దిగుతున్నారనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది.
సందీప్ పుట్టిన రోజు ఫంక్షన్‌ను కొన్నిరోజుల కిందట బొత్స కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ సంద ర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున కటౌట్లు వెలిశాయి. వీటిలో సందీప్‌ను బొత్స వారసుడిగా పేర్కొంటూ.. కామెంట్లు కనిపించాయి. ఇక, ఇటీవల ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజుసందర్భంగా కుమారుడిని వెంటబెట్టుకుని వచ్చిన బొత్స.. సీఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్వయంగా రక్తదానం కూడా చేశారు సందీప్.
ఈ పరిణామాలను గమనిస్తే.. త్వరలోనే సందీప్ కూడా రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, బొడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు సందీప్ రాజకీయ అరంగేట్రం చేస్తే..ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారు? అనేది ప్రశ్న. సరే.. పోటీ మాట అటుంచినా.. ఒకే కుటుంబం నుంచి ఐదుగురు రాజకీయాల్లో చక్ర తిప్పుతుండడం ఆసక్తిగా మారింది.
This post was last modified on January 11, 2021 7:28 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…