భూవివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అఖిలప్రియ సోదరి ఈ ఇష్యూ మీద మాట్లాడారు. తాము ఎవర్నీ డబ్బులకోసం డిమాండ్ చేయలేదన్న ఆమె.. రిమాండ్ రిపోర్టులో ఉన్న విషయాలు సరికావన్నారు.
హైదరాబాద్ లో తమకు భద్రత లేదన్నారు. వేరే రాష్ట్రం వాళ్లం కాబట్టి.. తమ పట్ల పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. కనీస సమాచారం లేకుండా 30నుంచి 40 మంది మగ పోలీసులు ఇంటికి వచ్చారని.. మహిళా పోలీసులు లేకుండా ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. మూడు నెలలుగా తన సోదరి ఆరోగ్యం బాగోలేదన్న ఆమె.. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయన్నారు.
గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా ఫిట్ గా ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. అఖిల విషయంలో ఎందుకలా వ్యవహరిస్తున్నారో తనకు తెలీటం లేదన్న భూమా మౌనిక ఈ ఇష్యూపై కూర్చొని మాట్లాడటానికి తాము సిద్ధమన్నారు. తమ వాటాల గురించి గతంలో తాము మాట్లాడామని.. ఎప్పుడూ ఎవరిని డబ్బుల కోసం డిమాండ్ చేయలేదన్నారు.
అక్క అఖిల అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చన్న అనుమానాన్నివ్యక్తం చేసిన ఆమె.. తన తండ్రికి చాలామందితో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయన్నారు. ‘మా నాన్న అకస్మాత్తుగా మరణించటంతో మా ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలీదు. మా నాన్నకు చాలామందివ్యాపార భాగస్వాములు ఉన్నారు. మా వాటాల కోసం గతంలో మేం వాళ్లతో మాట్లాడాం. అక్క కోసం నేను.. తమ్ముడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. కొట్టుకునేంత సీన్ ఇప్పుడు ఎవరికి లేదు. ఎవరైనా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పెద్ద మనిషి ఎవరబ్బా?
This post was last modified on January 8, 2021 1:54 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…