Political News

టీడీపీ రెండు విధాల నష్టపోతుందా ?

చివరకు తెలుగుదేశంపార్టీ రెండు విధాల నష్టపోతుందేమో అనే సందేహం మొదలైంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలు అలాగే ఉన్నాయి మరి. చంద్రబాబు తాజా వైఖరి చూసిన తర్వాత అందరికీ అర్ధమైంది ఇదే. తనకు అలవాటు లేని మతపరమైన అజెండాను చంద్రబాబు నెత్తికెత్తుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని బొడకొండమీద రామతీర్ధం ఆలయం దగ్గర చంద్రబాబు చూపించిన అత్యుత్సాహం, చేసిన హడావుడి చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి ఇటువంటి అజెండాను భుజాన వేసుకున్నంత మాత్రాన జనాలు ఓట్లేస్తారని అనుకునేందుకు లేదు. రాజకీయపార్టీలు ఏమి చేసినా అంతిమంగా రాజకీయంగా లబ్దికోసమే అని అందరికీ తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల విషయంలో టీడీపీ గోల చేసినా జనాలు పట్టించుకుంటారు కానీ మత పరమైన అజెండాను చంద్రబాబు ఎందుకు ఎత్తుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

నిజానికి హిందుత్వం, ఆలయాలు లాంటివి బీజేపీ అజెండా అన్న విషయం అందరికీ తెలిసిందే. జనాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లేయించుకోవాలన్నది బిజేపీ వ్యూహం. గల్లీలో మొదలైన ఇటువంటి వ్యూహాన్ని అమలు చేసే ఢిల్లీదాకా పాకింది. కాబట్టి మతపరమైన రాజకీయాల్లో పేటెంట్ రైట్సన్నీ బీజేపీ కే ఉన్నట్లు జనాలు కూడా ఫిక్సయిపోయారు. ఇటువంటి నేపధ్యంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అన్న అజెండాను చంద్రబాబు ఎంతగా భుజానేసుకున్నా ఉపయోగం ఉండదు.

బీజేపీకంటే ఉన్నదేమీ లేదు కాబట్టి పోయేది కూడా ఏమీలేదు. కాబట్టే కమలంపార్టీ నేతలు ఎంతస్ధాయికైనా తెగిస్తారు. కానీ టీడీపీ అలాకాదు. గతంలో ఎప్పుడైనా ఇటువంటి అజెండాతో రాజకీయాలు చేసిన చరిత్ర కూడా టీడీపీకి లేదు. అలాంటిది ఇప్పటికప్పుడు చంద్రబాబు తన అజెండాను ఎందుకు మార్చుకోవాలి ? హిందుత్వ అజెండాకు మద్దతుగా ఉండేవాళ్ళు బీజేపీకి ఓట్లేస్తారే కానీ టీడీపీకి వేసే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. మరి తన అజెండాను మార్చుకోవటం వల్ల ఉన్న ఓట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది టీడీపీకి.

హిందుత్వ అజెండాను చంద్రబాబు ఎంతగా భుజనేసుకుంటే మైనారిటిలు అంతగా టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. వైసీపీ పొలిటికల్ ఎంట్రీతో మైనారిటిల్లో మెజారిటి జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా నిలబడ్డారు. ఇదే సమయంలో టీడీపీని కూడా కొందరు సపోర్టు చేస్తున్నారు. అయితే చంద్రబాబు తాజా వైఖరితో ఉన్న కొద్దిమంది కూడా పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని టీడీపీలోనే నేతలు అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు వైఖరి వల్ల హిందుత్వ ఓట్లు రాకపోగా ఉన్న కొద్దిపాటి మైనారిటి ఓట్లు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని అర్ధమవుతోంది. మరి ఈ విషయం చంద్రబాబుకు అర్ధమవుతోందా ?

This post was last modified on January 4, 2021 9:53 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

5 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

6 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

7 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

7 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

8 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

8 hours ago