Political News

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది గద్దర్ అని స్పష్టమవుతుంది. మరో వ్యక్తి బహుజన ఉద్యమకారుడు అగస్టిన్ అని పవన్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత ఫొటోపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఫొటో తనకు తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఆలోచనల చుట్టూ సాగిన ఎన్నో చర్చలను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన సమావేశం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడి నుంచి పవన్ మాటల్లో, చేతల్లో తెలంగాణపై తనకున్న అనుబంధాన్ని చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం వంటి పలు అంశాలపై మాట్లాడుతున్నారు. తెలంగాణలో జనసేన కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. దీన్నిబట్టి అక్కడి రాజకీయాలపై కూడా ఆయన ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది.

ఈ క్రమంలోనే ఆయన ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో బహుజన భావజాలం, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలపై తరచూ చర్చలు జరిగేవని గుర్తు చేశారు. తెలంగాణ మేధావులు, బహుజన ఉద్యమకారుడు అగస్టిన్, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులతో కలిసి తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికార వికేంద్రీకరణ, సామాజిక తెలంగాణ నిర్మాణం వంటి అంశాలపై లోతైన చర్చలు సాగేవని అన్నారు.

తన తండ్రి వెంకటరావు మరణానంతరం అగస్టిన్, గద్దర్ తమ నివాసానికి వచ్చిన సందర్భంలో ఈ ఫొటో తీసినట్లు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందున్న కాలానికి చెందిన ఈ ఫొటో తన జీవితంలో ఒక ప్రత్యేక జ్ఞాపకమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయానికి రాజకీయ రూపం ఇవ్వాలన్న ఆకాంక్షలతో నిండిన ఆ రోజుల చర్చలు ఇప్పటికీ తనకు స్ఫూర్తినిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం రాజకీయ సాధికారతగా మారాలన్న లక్ష్యంతో జరిగిన ఆ ఆలోచనా వేదికలు తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.

This post was last modified on June 23, 2026 3:09 pm

Share

Recent Posts

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

44 minutes ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

2 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

2 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

5 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

5 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

6 hours ago