Political News

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడలో శ‌నివారం రాత్రి ఆయ‌న ఓ స‌భ‌లో మాట్లాడారు. వైసీపీ నాయ‌కులు కులం రాజ‌కీయాల‌తో కుట్రలు చేస్తున్నార‌ని అన్నారు. వారికి త‌న‌దైన రీతిలో తానేంటో చూపిస్తాన‌ని హెచ్చ‌రించారు. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపి.. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసిన‌ అనంత‌బాబుకు జేజేలు ప‌లుకుతున్నార‌ని వైసీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. అప్పుడు ఎందుకు కులం గుర్తుకురాలేద‌న్నారు.

రాష్ట్ర హోం మంత్రి అనిత‌ను తిట్టిన వైసీపీ వారిని(గుడివాడ అమ‌ర్నాథ్‌) చూసి రేపు మ‌రికొంద‌రు రాష్ట్రంలోని ఆడ‌ప‌డుచుల‌ను దూషిస్తార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అత్యంత క‌ఠినంగా ఉండాల‌ని తెలిపారు. వైసీపీ గూండాల‌ను తొక్కి నార‌తీస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇక‌, సుగాలి ప్రీతి కేసును కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను కొంద‌రు ధ్వంసం చేశార‌ని.. సాక్ష్యాధారాలు ధ్వంస‌మైన కేసుల‌ను ఏం చేస్తామ‌ని.. ప్ర‌శ్నించారు. శ‌వాలు లేస్తే కానీ.. వైసీపీకి సంతోషం రాద‌ని దుయ్య‌బ‌ట్టారు.

క్రిమిన‌ల్స్‌ను కులం కోణంలో చూడ‌రాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వైసీపీ బ‌ల‌మే కులం క్రిమిన‌ల్స్ అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. నేర‌స్తులు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో కూర్చుని శాసిస్తామంటే జీవితాంతం తాను పోరాడ‌తాన‌ని చెప్పారు. క్రిమిన‌ల్స్ పాల‌కులుగా ఉండ‌కూడ‌ద‌న్న‌దే త‌న సిద్ధాంత‌మ‌ని వ్యాఖ్యానించారు.

వైసీపీ క్రిమిన‌ల్స్‌ను చూస్తూ ఊరుకునేది లేద‌ని.. తొక్కినార తీస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాస్వామ్యంంలో క్రిమిన‌ల్స్‌కు చోటు లేద‌న్నారు. వారు రాజ్యాంగ ప‌ద‌వుల్లోకి రాకుండా అడ్డుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. దీనికిగాను తాను ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.

This post was last modified on June 21, 2026 12:19 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

11 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

4 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago