‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

“సినిమాలో పవర్ స్టార్… రాజకీయాల్లో జనసేనాని. ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్న” అని లోకేష్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్‌ను “పవనన్న”గా సంబోధిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రాజకీయాలకు అతీతంగా తమ మధ్య సోదరభావం, పరస్పర గౌరవం ఉందనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లోకేష్‌కు అండగా నిలుస్తూ, సోదరుడిలా మద్దతు ఇస్తున్నారని అభిమానులు పేర్కొంటున్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఒకే కుటుంబంలా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. కూటమిలో చిన్నచిన్న సమస్యలు రావడం సహజమేనని, అయితే వాటిని అందరూ కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత నాయకులందరిపైనా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్న అంటూ ఆయనను కొనియాడారు.