బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.
మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా… గత ఎన్నికలకు ముందు సడెన్ గా టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం రాధా….జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో, రాధా ఏ పార్టీలోనూ నిలకడగా ఉండరన్న టాక్ ఉంది. దీంతో, రాధా మాత్రం ఈ సారి టీడీపీలోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారని, దీంతో, రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
కానీ, రంగా హత్యకు టీడీపీ నేతలే కారణమని కొద్ది రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాధా తిరిగి సొంతగూటికి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరాలని రాధాను మంత్రి కొడాలి నాని కోరారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. వైసీపీని వద్దనుకొని వచ్చిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరేందుకు రాధా ఇబ్బందిగా భావిస్తున్నారని చెప్పుకున్నారు.
కానీ, 2019 ఎన్నికలలో సీటు విషయం మినహాయించి వైసీపీతో, సీఎం జగన్ తో రాధాకు విభేదాలు లేవు. దీంతో, రాధా కూడా అనవసరంగా వైసీపీని వీడానన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికితోడు, తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీతో తన రాజకీయ భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని డిసైడయినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీని వీడి రాధా వైసీపీలో చేరతారా? మళ్లీ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా కీలకంగా మారతారా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలి.
This post was last modified on January 3, 2021 12:37 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…