తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో పొత్తు అవసరం లేదు అని పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన స్వతంత్రంగా పోటీ చేసి పరిమిత సీట్లు గెల్చుకున్న అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పవన్ ఈ కామెంట్లు చేసినట్లుగా అనిపిస్తోంది. జనసేనతో పొత్తు లేదు, స్వతంత్రంగా పోటీ చేశామని ఆయన చెప్పారు. దానికి స్పందనగానే పొత్తు లేకుండానే జనసేన బలంగా నిలబడుతుందని పవన్ ప్రకటించినట్లు కనిపిస్తోంది.
అయితే, ఏపీ రాజకీయాల మాదిరిగా తెలంగాణ రాజకీయాల్లో జనసేన నిలబడడం అంత సులభం కాదు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అనేక సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి మూడు పెద్ద పార్టీలతో పాటు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేనతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది.
తెలంగాణలో స్థానిక సమస్యలు, అభివృద్ధి, అన్యాయాలపై పోరాడతామని పవన్ అన్నారు. అయితే, స్వతంత్రంగా నిలబడడం మూడు పెద్ద పార్టీలతో తలపడడం అంత ఈజీ కాదు.
ఆంధ్రా నాయకుడిగా పవన్ కు ముద్రపడింది. అందులోనూ అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉన్నారు. కాబట్టి, పవన్ ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవడం కష్టం.
తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రా నేపథ్యం కారణంగా పవన్ వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆంధ్రాలో కూడా జనసేన సంస్థాగతంగా బలపడాల్సి ఉంది. ఇక తెలంగాణలో అయితే జనసేనకు ఉన్న సంస్థాగత బలం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేడర్, లోకల్ లీడర్‌షిప్ పరంగా జనసేన గ్రౌండ్ లెవెల్ నుంచి బలపడాల్సి ఉంది.
రాజకీయాల్లో పొత్తు లేకుండా బలపడడం సాధ్యమే…కానీ చాలా కష్టం. పవన్ ఎప్పట్లాగే భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణలో ఇది ఎంతవరకు పని చేస్తుంది అన్న ప్రశ్నకు కాలనీ సమాధానం చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates