Political News

యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. మోడీది రాజ‌కీయ‌మే

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధ‌మైనా.. విప‌త్త‌యినా.. ప్ర‌జ‌లకు ఏం జ‌రిగినా.. ప్ర‌ధాని మోడీకి రాజ‌కీయాలే ముఖ్య‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న యుద్ధ స‌మ‌యాన్ని.. త‌ద్వారా వ‌చ్చిన ఇంధన విప‌త్తును ఎవ‌రూ కాద‌న‌లేర‌న్నారు. కానీ.. దీని వెనుక చేసిన రాజ‌కీయ‌మే ఇప్పుడుచ‌ర్చ‌కు కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందే.. ప‌శ్చిమాసియాలో యుద్ధం మొద‌లైంద‌న్నారు.

ఆ స‌మ‌యంలోనే చ‌మురు ఉత్ప‌త్తులు.. రావ‌డం త‌గ్గిపోయింద‌ని, కానీ, ఆ స‌మ‌యంలో ఈ విష‌యాన్ని దాచి పెట్టిన ప్ర‌ధాని, ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు ముగియ‌గానే.. ధ‌ర‌లు పెంచి.. పొదుపు మంత్రం పాటించాలని చెప్ప‌డం రాజ‌కీయం కాక మ‌రేమిట‌ని ప్ర‌శ్నించారు. యుద్ధం ఎప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతుందో చెప్ప‌లేమ‌ని.. ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ఈ విప‌త్తు కూడా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుందో కూడా చెప్ప‌లేమ‌ని తెలిపారు. కానీ, మోడీది రాజ‌కీయ కోణ‌మైతే.. త‌మ‌ది కార్మికుల కోణ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

కార్మికుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ.. విష‌యాన్ని దాచిపెట్టి రాజ‌కీయ ల‌బ్ధిపొందాల‌నుకునే మోడీ వంటి వ్య‌క్తుల‌కు వ్య‌తిరేకంగా స‌మాజం ఒకే తాటిపైకి రావాల‌ని సూచించారు. మేధావులు ఈ విష‌యాన్ని చ‌ర్చించాల‌న్నారు.

This post was last modified on May 21, 2026 10:09 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

10 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago