తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ తాజా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సరికొత్త అవతారం ఎత్తారు. సీఎం పదవి నుంచి దిగిపోయిన దీదీ… గురువారం సరికొత్తగా న్యాయవాది అవతారం ఎత్తారు. న్యాయవాదుల వేషధారణలో బయలుదేరిన దీదీ.. నేరుగా కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. కలకత్తా హైకోర్టులో విచారణకు రానున్న ఓ కీలక కేసులో తృణమూల్ కాంగ్రెస్ తరఫున స్వయంగా దీదీనే వాదనలు వినిపించనున్నారు. ఈ కారణంగానే దీదీ బ్లాక్ కోట్ వేసుకుని మరీ కోర్టుకు హాజరయ్యారు.
ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగానే సాగినా… మొన్నటిదాకా దీదీ పాలనలో ఉన్న బెంగాల్ లో మాత్రం హింస చోటుచేసుకుంది. పోలింగ్ సమయంలోనే కాకుండా పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా… దానిని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారించనుంది.
ఈ విచారణకు తృణమూల్ తరఫున వాదనలు వినిపించేందుకు ఆ పార్టీ అదినేత్రిగా ఉన్న దీదీనే స్వయంగా రంగంలోకి దిగడం గమనార్హం. ఎన్నికల సమయంలో కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ హింసను ప్రేరేపించిందని, తృణమూల్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసిన బీజేపీ నేతలు దౌర్జన్యకాండ సాగించారన్నది దీదీ ఆరోపణ.
బెంగాల్ లో ఈ దఫా ఎన్నికలు సవ్యంగా సాగలేదని, బీజేపీ దమన నీతితో జరిగిన ఎన్నికలను తాను ఒప్పుకునేది లేదని ఇదివరకే దీదీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని కూడా ఆమె సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే దీదీ కోర్టుకు లాయర్ వేషధారణలో వచ్చారు. కోర్టులో దీదీ చేసే వాదనలపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on May 14, 2026 3:13 pm
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…