Political News

రైతుల ఉద్యమం ఇప్పట్లో ఆగేలా లేదు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ దాదాపు రెండు నెలల క్రితం మొదలైన రైతు ఉద్యమం ఇప్పటితో ఆగేలా లేదు. హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో అన్నదాతలను ఢిల్లీ పోలీసులు అడ్డగించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నాన్ని సింఘూ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుండి అక్కడే అన్నదాతలు మకాం వేసేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు, ఎట్టిపరిస్ధితుల్లోను చట్టాలను రద్దు చేసేది లేదని కేంద్రప్రభుత్వం పట్టుబట్టిన నేపధ్యంలో రైతుల ఉద్యమం నిరంతరంగా సాగుతోంది.

రైతుల ఉద్యమ తీరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేట్లుగా లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉద్యమం చేయటానికి మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాత రైతు సంఘాలు ఉద్యమానికి నడుం బిగించినట్లు అర్ధమైపోతోంది. సింఘూ ప్రాంతంలోనే వేలాదిమంది రైతులు వేలాది టెంట్లు వేసుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నుండి పెద్ద ఎత్తున రైతులు ఉద్యమ ప్రాంతానికి చేరుకున్నారు. యావత్ దేశాన్ని చలిపులి వణికించేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీని చలి వణికించేస్తోంది.

ఇంతటి చలిలో కూడా రైతులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నారంటేనే వాళ్ళెంత ప్రిపేర్డుగా ఉన్నారో అర్ధమైపోతోంది. పై రెండు రాష్ట్రాల నుండి రైతుల కుటుంబాల నుండే కాకుండా గ్రామాలు, విదేశాల నుండి కూడా ఉద్యమనికి అవసరమైన నిధులు అందుతున్నట్లు సమాచారం. ఉద్యమంలో పాల్గొన్న రైతులకు చెందిన భూములను ఆయా గ్రామాల్లోని మిగిలిన రైతుల కుటుంబాలు సంరక్షిస్తున్నాయట.

ఇక సింఘూ ప్రాంతంలో చలిని తట్టుకునేందుకు టెంట్లలో హీటర్లు కూడా పెట్టుకున్నారు. భోజనానికి అవసరమైన రోటీ, కర్రీ, దాల్ మేకర్లు కూడా ఉన్నాయి. వృద్ధులకు మంచాలతో పాటు పరుపులు, రజాయిలు కూడా ఉన్నాయి. వీళ్ళకు వైద్య సైకర్యాలు అందించేందుకు డాక్టర్ల బృందాలు కూడా వంతులవారీగా పై రాష్ట్రాల నుండి వస్తున్నాయి. వంతుల వారీగా వైద్య బృందాలు వచ్చి కొద్ది రోజులపాటు వీళ్ళతోనే ఉంటున్నాయి. స్వచ్చంద సంస్ధలు ఉద్యమానికి మద్దతుగా ఇతరత్రా ఆహారాన్ని, మందులను అందిస్తున్నాయి. మరికొన్ని సంస్ధలైతే ఇంటర్నెట్, ల్యాపుటాపులు, కంప్యూటర్లు, జనరేటర్లను కూడా అందించినట్లు సమాచారం. చేసుకున్న ఏర్పాట్లను చూస్తుంటే రైతుల ఉద్యమం ఇప్పట్లో ఆగేట్లు లేదు.

This post was last modified on December 28, 2020 10:41 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

18 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago