Political News

జీవన్ రెడ్డి రాకతో కారు గేరు మారేనా?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో తన నలభై ఏళ్ల బంధాన్ని తెంచుకుని మరీ బీఆర్ఎస్ గూటికి చేరువవుతున్నారు తెలంగాణ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. అందులో భాగంగా శుక్రవారం ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ దృశ్యాలను చూసిన వారంతా.. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ దశ మారుతుందా? అన్న దిశగా విశ్లేషిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి… పేరుకు సీనియర్ మోస్ట్ నేత కిందే లెక్క. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏకంగా 14 బీఫారాలను అందించింది. అయితే ఆయన 14 సార్లు విజయం సాధించలేదు. కేవలం ఆరు సార్లు మాత్రమే గెలిచారు. మిగిలిన పర్యాయాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లోనూ ఆయన కొత్తగా వచ్చిన సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. నాడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయగా… బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సంజయ్ చేతిలో ఓడిపోయారు. 

అంటే… మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటే… ఓడిన జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఆశ్రయంగా మారుతోంది. ఇక జీవన్ రెడ్డి బలగం విషయానికి వస్తే…తన నియోజకవర్గంలో తనను తాను గెలిపించుకునే పరిస్థితి లేని జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ ఏం లబ్ధి పొందుతుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా కావడానికి సీనియర్ నేతే అయినా జీవన్ రెడ్డి ఇప్పటి కొత్త తరం నేతలతో పోటీ పడే సత్తా లేదన్న రీతిలోనూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. వైఎస్ కు ఉన్న అత్యంత సన్నిహితుల జాబితాలో జీవన్ రెడ్డి కూడా ఒకరని చెప్పాలి. అప్పటిదాకా ఉమ్మడి ఏపీ మొత్తానికి కూడా పెద్దగా తెలియని జీవన్ రెడ్డి… వైఎస్ పుణ్యమా అని రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు.

వైఎస్ కేబినెట్ లో సత్తా కలిగిన మంత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఇక తన నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పోరాటంలో ఎంతదాకా అయినా వెళ్లే జీవన్ రెడ్డి వైఖరి అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. వెరసి జీవన్ రెడ్డి క్లీన్ ఇమేజీ బీఆర్ఎస్ కు ఓ మోస్తరుగా ఉపయోగపడవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on April 11, 2026 7:48 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

1 hour ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago