టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా దానికి ఓ రీజనింగ్ ఉంటుంది. ఇక పార్టీ నేతలను ఆయన మందిలించారంటే… సదరు నేతలకు సంబంధించిన తప్పొప్పులను పక్కాగా నిర్ధారించుకుని మరీ బాబు క్లాస్ లు పీకుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో తమ తప్పులు అధినేతకు ఇంత పక్కాగా ఎలా తెలిసివచ్చాయబ్బా అంటూ ఆయా నేతలు జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఇలాంటి ఘటన పార్టీ యువనేత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఎదురైంది.
విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ నుంచి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండపల్లి తొలి యత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ కు బాబు కేబినెట్ లో అనూహ్యంగా మంత్రి పదవి కూడా లభించింది. యువజన సర్వీసులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కొనపాగుతున్న శ్రీనివాస్.. పూర్వాశ్రమంలో విదేశాల్లో ఉన్నత ఉద్యోగం సంసాదించి… ఆపై ఏకంగా విదేశాల్లో కంపెనీలు స్థాపించి సత్తా చాటుకున్నారు. టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేశ్ టీం మెంబర్ గా కొండపల్లికి మంచి పేరుంది.
అయితే నియోజకవర్గంలో శ్రీనివాస్ తండ్రి పెత్తనం అంతకంతకూ పెరిగిపోయిందట. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు బాబుకు ఫిర్యాదులు అందినా… చూద్దాం…ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని బాబు ఆగారట. అయితే కుమారుడి వ్యవహారాలకు సంబందించి శ్రీనివాస్ తండ్రి మరింతగా జోక్యం చేసుకుంటున్నారట. ఈ క్రమంలో బుధవారం విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ సందర్భంగా శ్రీనావస్ కు బాబు ఫుల్ క్లాస్ పీకారట.
విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉత్తమంగా రాణించిన కారణంగా తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రిగా అవకాశం కల్పించామని శ్రీనివాస్ తో బాబు అన్నారట. అలాగని మీ వ్యవహారాల్లో మీ తండ్రి జోక్యం ఏమిటని బాబు ఆయనను ముఖం మీదే ప్రశ్నించారు. ఇలాగైతే కుదరదని కూడా బాబు తేల్చి చెప్పారట. తన నియోజవర్గంలో జరుగుతున్న విషయాలను పక్కాగా తెలుసుకుని మరీ బాబు క్లాస్ పీకుతున్న తీరును చూసి కొండపల్లి అవాక్కయ్యారట. ఆపై వెనవెంటనే తేరుకుని తన వ్యవహారాల్లో తన తండ్రి జోక్యం నిజమేనని… అయితే గడచిన 6 నెలలుగా ఆ జోక్యానికి ఫుల్ స్టాప్ పెట్టేశానని కొండపల్లి సంజాయిషీ ఇచ్చుకున్నారట.
యువ నాయకుడివని మంత్రి పదవి ఇస్తే… వ్యవహారాలను చక్కబెట్టే దిశగా ఆశించిన మేర వృద్ధి సాధించట్లేదని శ్రీనివాస్ కు బాబు అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయా అంశాలపై సమగ్రమైన అవగాహన ఉంటుందని, ఈ కారణంగానే కీలక శాఖలను అప్పగించామని, ఇకనైనా పనితీరును మెరుగుపరచుకోవాలని, లేదంటే ప్రయోజనం ఉండదని బాబు అన్నారట. దీంతో సర్దకున్న కొండపల్లి…ఇకపై మరింత దీక్షతో పనిచేస్తానని బాబుకు మాట ఇచ్చారట.
This post was last modified on April 9, 2026 12:32 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…