పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. అయితే..కూటమి ప్రభావంతోపాటు..స్థానికంగా పెరిగిన వ్యతిరేకత కూడా తోడై.. పేర్ని వారసుడు పరాజయం పాలయ్యారు. కానీ, చిత్రం ఏంటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజక వర్గాల్లో వైసీపీ ఓడిన చోట ఆ పార్టీ ఛాయలు.. ఆ పార్టీ నాయకులు వెనుకబడ్డారు. ఎక్కడా గళం వినిపించే నాయకులు కూడా కనిపించడం లేదు.
కానీ, మచిలీపట్నం నియోజకవర్గంలో మాత్రం గెలిచిన టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర కంటే కూడా.. పేర్ని వాయిస్సే ఎక్కువగా వినిపిస్తోంది. వారి రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విషయం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు రోజూ వార్తల్లో కనిపిస్తున్నారు. కేసులకు కూడా భయపడేది లేదంటూ సవాళ్లు రువ్వుతున్నారు. ఒకరకంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు నియోజక వర్గాలతో పోల్చుకుంటే.. మచిలీపట్నం నియోజకవర్గం ఒక్కటే నిరంతరం హాట్‌హాట్ గా ఉంటోంది.
రీజనేంటి.. ?
దీనికి కారణం.. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని రాజకీయ అస్తిత్వం సమసిపోకూడదన్న ఏకైక లక్ష్యమేనని తెలుస్తోంది. తాను సైలెంట్ అయితే.. ఇక, ఉనికి ఉండదన్న కారణంగానే పేర్ని నాని.. నిత్యం మీడియా ముందుకు వస్తున్నారన్న చర్చసాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఈ నియోజకవర్గాన్ని తమ వారసుడికి అనుకూలంగా మార్చాలన్న సంకల్పం కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
సాధ్యమేనా..?
ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వ ఇమేజ్ భారీగానే ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ నియోజకవర్గంలో జోరు కనిపిస్తోంది. మంత్రి కొల్లు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు.
కానీ.. ఎన్నికల తీరు ఎలా ఉన్నప్పటికీ.. పేర్ని హవా తగ్గకూడదన్న కోణంలోనే నాని ప్రయత్నాలు చేస్తున్నారన్నది వాస్తవం. తమ కేడర్.. తమ పార్టీ జెండాను కాపాడుకోవడమే ప్రస్తుత లక్ష్యంగాఆయన అడుగులు వేస్తున్నారు. మరి ఈ ఇమేజ్ వచ్చే ఎన్నికల్లో పెరుగుతుందా? లేదా? అనేది చూడాలి. కానీ, ఇదే జోరు కొనసాగితే మాత్రం జిల్లాలో అత్యంత టఫ్ నియోజకవర్గంగా మారుతుందన్నది వాస్తవమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 6, 2026 1:24 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…