Political News

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేలు.. త‌మ దారిన తాము వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రికి అనుకూలంగా ఉన్న రాజ‌కీయాల‌ను వారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగానే కాకుండా.. ప్ర‌భుత్వానికి కూడా వారు చెడ్డ‌పేరు తెస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలో ముఖ్యంగా 9 మంది టీడీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రింత వివాదాస్పదంగా ఉంది.

1)  కొలికపూడి:  తిరువూరు నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఎస్సీ నాయ‌కుడు కొలిక‌పూడి శ్రీని వాస‌రావు.. దూకుడు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. ప్రొటోకాల్ ర‌గ‌డ‌.. మ‌రింత ఎక్కువ‌గా ఉంది.

2)  అస్మిత్ రెడ్డి:  అనంత‌పురం లోని తాడిప‌త్రి నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న జేసీల వార‌సుడు. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న దానిని వదిలేసి.. త‌నకు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో స‌ర్కారుపై చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీలోనూ క‌లివిడి లేదు.

3)  చ‌ద‌ల‌వాడ‌: న‌ర‌స‌రావుపేట నుంచి విజ‌యం ద‌క్కించుకున్న చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు.. మ‌రింత వివాదానికి కేంద్రంగా మారుతున్నారు. తాను చెప్పిన వారిని నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకునేందుకు అధికారుల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ ప‌రంగా కూడా మైన‌స్ అవుతున్నారు.

4) మామిడి:  పాత‌ప‌ట్నం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మామిడి గోవింద‌రావు.. మీడియాపై చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా వార్త‌లు రాయాల‌ని.. త‌న లోపాలు వెత‌క్కూడ‌ద‌ని ఆయ‌న హుకుం జారీ చేస్తున్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న అందుబాటులో ఉండ‌డం లేదు.

5) భూమా అఖిల‌:  ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న భూమా అఖిల ప్రియ‌.. పార్టీలో సెగ ఎదుర్కొంటున్నారు. క‌లుపుకొనిపోవాల‌ని పార్టీ అధినేత చెబుతుంటే.. విడివిడి రాజ‌కీయాలు చేస్తూ.. ఆధిప‌త్య ధోర‌ణిలోనే ముందుకు సాగుతున్నారు. రెండేళ్ల‌యినా.. ఆమెలో మార్పు క‌నిపించ‌డం లేద‌ని తాజాగా నివేదిక చంద్ర‌బాబుకు అందింది.

6) మాధ‌వి: క‌డ‌ప నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి రెడ్డి ప‌రిస్థితి మ‌రింత దూకుడుగా ఉంది. అధికారుల‌పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. ప్ర‌జ‌ల‌కోసం ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా.. త‌ప్పులేదు. కానీ.. త‌న‌కు నీళ్లు ఇవ్వ‌లేద‌ని.. కుర్చీ వేయ‌లేద‌ని.. వేదిక‌పైకి పిల‌వ‌లేద‌ని.. ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పార్టీ ప‌రంగా కూడా వెనుక‌బ‌డ్డారు.

7)  బొజ్జ‌ల‌:  శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి వార‌సుడు సుధీర్ రెడ్డి ప‌రిస్థితి `ఎప్పుడు ఓడిద్దామా?` అన్న‌ట్టుగా సొంత పార్టీ నాయ‌కుల మ‌ధ్యే చ‌ర్చ జ‌రుగుతోందంటే.. షాకింగ్ కాదు.. వాస్త‌వం!. దీనికి కార‌ణం.. ఆయ‌న దూకుడు, దురుసు ప్ర‌వ‌ర్త‌న‌లే. నోటిని అదుపులో పెట్టుకోక‌పోవ‌డం.. భారీ మైన‌స్‌.

8)  బొండా:  విజ‌య‌వాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు బొండా ఉమా మ‌హేశ్వ‌రరావు.. ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఆయ‌న `క‌లెక్ష‌న్ కింగ్‌`, `సెటిల్మెంటు రాయుడు` అయిపోయార‌ని.. పెద్ద ఎత్తున పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న త‌న‌ను తాను స‌రిదిద్దు కోక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందే నియోజ‌క‌వర్గాల్లో ఇది ఫ‌స్ట్ ఉంటుంద‌ని.. నారా లోకేష్‌కు కూడా స‌మాచారం వెళ్లిపోయింది.

9) ఇంటూరి:  కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఇంటూరి నాగేశ్వ‌ర రావు.. చేసేది త‌క్కువ-వ‌సూలుఎక్కువ అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. గ‌నులు, ఇసుక స‌హా అనేక ఆర‌ప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇలా.. ఈ 9 మంది పేర్లు.. ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 3, 2026 9:37 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

29 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

47 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

52 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago