సొంతజిల్లా కడపలో మూడు రోజుల పర్యటనలో ఉన్న జగన్ ఓ విషయంలో ప్రజలను క్షమాపణలు కోరారు. గండికోట రిజర్వాయర్ విషయమై మాట్లాడుతూ ప్రజల త్యాగాల వల్లే గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ‘పునరావాసం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమించండి’ అని వేదిక మీదనుండి చేతులు జోడించి వేడుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదలైన గండికోట రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. తర్వాత కూడా పనులు జరిగినా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్సు పనులను స్పీడుగా పూర్తిచేశారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం 26.85 టీఎంసీలు. అయితే గండికోట రిజర్వాయర్లో ఎప్పుడు కూడా పూర్తిస్ధాయిలో నీటి నిల్వ జరగలేదు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం పెంచేకొద్దీ ముంపు మండలాల సమస్య కూడా పెరిగింది.
పూర్తి స్ధాయిలో నీటి నిల్వ చేయాలన్న జగన్ ఆదేశాలతో రిజర్వాయర్ కు ఆనుకుని ఉన్న కొండాపురం మండలంలోని కొన్ని గ్రామలతో పాటు తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామాన్ని కూడా నీళ్ళు చుట్టేశాయి. అయితే తమకు పునరావాసం కల్పించకుండా తమ గ్రామాలను వదిలిపెట్టమంటే ఎక్కడికీ వెళ్ళేది లేదని పై గ్రామాల్లోని జనాలు గట్టిగా ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. దాంతో ఉన్నతాధికారులకు, గ్రామస్తులకు మధ్య చాలా కాలం వివాదాలు నడిచాయి.
మొత్తానికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చొరవతో పునరావాసంతో పాటు నష్టపరిహారం వివాదం కూడా ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఇంకా కొంతమందికి నష్టపరిహారం అందలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో జగన్ వేదిక మీద నుండి తనను క్షమించమని వేడుకున్నారు. 2013లో మొదటిసారిగా రిజర్వాయర్లో 3 టీఎంసీల నీటిని నిల్వచేశారు. 2016లో 5.5 టీఎంసీలు, 2017లో 8.2 టీఎంసిలు, 2018లో 12 టీఎంసీలు, 2019లో కూడా 12 టీఎంసీల నీటిని నిల్వచేశారు. ఈ యేడాదిలోనే రికార్డు స్ధాయిలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
This post was last modified on December 24, 2020 10:17 pm
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…
వెంకటేష్ కెరీర్ లో మొదటి వెబ్ సిరీస్ గా వచ్చిన రానా నాయుడుకు వ్యూస్ మిలియన్లలో వచ్చాయి కానీ కంటెంట్…
అసలే గంజాయిపై ఏపీలోని కూటమి సర్కారు యుద్ధమే ప్రకటించింది. ఫలితంగా ఎక్కడికక్కడ పోలీసులు వాహనాల తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన…