కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ వచ్చేస్తోందని ఆనందిస్తున్న వేళ బ్రిటన్లో కొత్త వణుకు మొదలైంది. కరోనా వైరస్సే తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోందని బ్రిటన్ శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించేసింది. అంతేకాకుండా బ్రిటన్ నుండి ఇతర ఐరోపా దేశాలకు విమాన సేవలను రద్దు చేసేసింది. విదేశీయులెవరు తమ దేశంలోకి రావద్దని స్పష్టంగా ప్రకటించటం చూస్తుంటేనే వైరస్ తీవ్రత ఎంతగా వణికించేస్తోందో అర్ధమైపోతోంది.
రూపు మార్చుకున్న కరోనా వైరస్ ను తొలిసారిగా మొన్నటి సెప్టెంబర్ నెలలోనే బ్రిటన్ వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నపుడు జరిగిన రక్త పరీక్షల్లోనే ఈ వైరస్ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఇదే విషయంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు తాజాగా ఇదే విషయాన్ని బయటపెట్టారు.
శాస్త్రజ్ఞుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుజాగ్రత్తగానే లాక్ డౌన్ విధించటమే కాకుండా విదేశాలతో ప్రమాణ సంబంధాలను కూడా రద్దు చేసింది. బ్రిటన్లో రోగిలో గుర్తించిన ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నే తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రోగిలో బయటపడింది. ఇదే విషయమై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తమ దేశంలోని ఓ రోగిలో ప్రమాదకరమైన కరోనా వైరస్ ను గుర్తించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యశాఖకు కూడా వెంటనే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
నిత్యావసరాలను తీసుకొచ్చే విమానాలు తప్ప ఇతరత్రా సర్వీసుల విమానాలను రద్దు చేసినట్లు బోరిస్ ప్రకటించటంతో ఇతర దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ కు వెళ్ళవద్దని ఒకవేళ ఇప్పటికే ఆ దేశంలో ఉండుంటే వెంటనే తిరిగి వచ్చేయాలంటు ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి దేశాలు తమ పౌరులకు పిలుపివ్వటంతో వైరస్ తీవ్రత ఏమిటనేది అర్ధమవుతోంది. మరి ఎంతో కష్టపడి బ్రిటన్లోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఒకవైపు కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ తీసుకొచ్చిన నేపధ్యంలోనే వైరస్ రూపు మార్చుకుని మరింత ప్రమాదకరం అవ్వటం ప్రపంచానికి ఆందోళన కలిగించేదనటంలో సందేహం లేదు.
This post was last modified on December 21, 2020 10:53 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…