Political News

బెంగాల్ రాజకీయపార్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో బీజేపీ ఒక్కసారిగా అన్నీ రాజకీయపార్టీలపైనా ఏకకాలంలో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఊహించని రీతిలో కమలం పార్టీ చేసిన స్ట్రైక్ తో అన్నీ పార్టీలు బిత్తరపోయాయి. మిగిలిన పార్టీల మాటెలాగున్నా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బపడిందనే చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు ఎంఎల్ఏలు, ఓ ఎంపితో పాటు పదిమంది కీలక నేతలు పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు.

వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది కమలం పార్టీ నేతల టార్గెట్. వచ్చే ఎన్నికల్లో 200 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి మమతబెనర్జీని ఒకేసారి అన్నీ వైపుల నుండి దిగ్బంధం చేసే ప్లాన్ తో ముందుకెళుతున్నారు. మొదటగా గవర్నర్ వైపు నుండి పొగ పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత తృణమూల్ పార్టీ నేతలను లాగేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శాంతిభత్రతలు సృష్టిస్తున్నారు.

ఇవన్నీ చాలావన్నట్లుగా మమతకు బాగా నమ్మకస్తులని ముద్రపడిన అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రానికి వచ్చేయాలంటూ ఒత్తిళ్ళు మొదలుపెట్టారు. నోటీసులిచ్చి మరీ వాళ్ళని సతాయిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్లో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి రోజైన శనివాం తృణమూల్ తో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒక్కో ఎంఎల్ఏను బీజేపీ లాగేసుకుంది.

తృణమూల్ పార్టీని వదిలేసిన నేతలందిరిలోకి సువేందు అధికారి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే జంగల్ మండల్ ప్రాంతంలోని సువేందు కుటుంబానికి సుమారు 40 నియోజకవర్గాల్లో అపారమైన పట్టుంది. ఈయన తండ్రి, సోదరులు ఎంపిలుగా ఉన్నారు. అలాగే వీళ్ళ మద్దతుదారులే చాలామంది ఎంఎల్ఏలుగా ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళంతా అధికారపార్టీలోనే ఉన్నారు. అయితే ఎప్పుడు పార్టీని వదిలేస్తారో తెలీక మమతకు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ కుటుంబం వల్ల ఒకేసారి 40 నియోజకవర్గాల్లో తృణమూల్ పార్టీకి దెబ్బపడటం ఖాయంగా అనిపిస్తోంది.

పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రావాలన్నది బీజేపీ దశాబ్దాల కల. కానీ 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం కారణంగా 27 ఏళ్ళు బీజేపీ కల నెరవేరలేదు. తర్వాతైన అధికారంలోకి వచ్చేస్తామనుకుంటే పదేళ్ళు మమతాబెనర్జీ అడ్డుపడ్డారు. దాంతో ఇపుడు జరిగే ఎన్నికల్లో గనుక అధికారంలోకి రాలేకపోతే భవిష్యత్తులో అవకాశాలు తగ్గిపోతాయన్నది కమలంపార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా బెంగాల్లో అధికారంaలోకి రావటం కష్టమన్న ఆలోచనను కూడా మోడి-షా ధ్వయం తట్టుకోలేకపోతోంది. అందుకనే ఎలాగైనా బెంగాల్లో జెండా పాతాలన్న ఆలోచనతోనే పావులు కదుపుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 20, 2020 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

56 minutes ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

3 hours ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

4 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

5 hours ago