చంద్రబాబునాయుడు పేరు చేబితేనే మంత్రి కొడాలానాని పూనకం వచ్చినట్లు ఊగిపోతారని అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రబాబు గురించి కొడాలి చేసే వ్యాఖ్యలకు హద్దుండదు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు అందరు గమనించిందే. కానీ గురువారం మంత్రి మాట్లాడిన మాటలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయనటంలో సందేహం లేదు. ఓ వ్యక్తిమీద కోపం ఉంటే ఉండచ్చు కానీ దాన్ని ప్రదర్శించే పద్దతికి కొన్ని పరిమితులుంటాయని కొడాలి తెలుసుకోవాలి.
అమరావతి కోసం గురువారం జరిగిన రాయపూడి బహిరంగసభ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టే ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోపణలకు కౌంటర్ ఇవ్వటం కోసం మంత్రులు పేర్నినాని, కొడాలి నాని మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా బ్యాలెన్సు కోల్పోకుండా ముందు పేర్ని మాట్లాడారు. పేర్ని కూడా చంద్రబాబునే టార్గెట్ చేసినా ఎక్కడా సంయమనం కోల్పోకుండా చెప్పదలచుకున్నది సూటిగా చెప్పారు.
కానీ తర్వాత మాట్లాడిన కొడాలి మాత్రం అదేదో సినిమాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినట్లుగా మాట్లాడారు. నిజానికి చంద్రబాబు విషయంలో కొడాలి ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. చంద్రబాబును ఉద్దేశించి కొడాలి కూడా కొన్ని సూటి ప్రశ్నలనే సంధించారు. కానీ ఆ ప్రశ్నల తాలూకు తీవ్రత మంత్రి మాట్లాడిన భాషలో కొట్టుకుపోయింది. కొడాలి వేసిన ప్రశ్నలకన్నా తిట్టిన తిట్టే బాగా ఎక్కువగా వినబడ్డాయి.
దాదాపు పావుగంటపాటు కొడాలి మాట్లాడితే అందులో కనీసం 10 నిముషాలకుపైగా చంద్రబాబును తిట్టటానికే సరిపోయింది. శాపనార్ధాలేంటి ? తిట్లేంటి ? సవాళ్ళేంటి ? తాను ఓ బాధ్యత కలిగిన మంత్రిహోదాలో ఉన్న విషయాన్ని కూడా కొడాలి మరచిపోయినట్లున్నారు. అయితే ఇక్కడ ఓ పాయింటు కూడా ఉంది. అదేమిటంటే తాను జగన్ను టార్గెట్ గా చేసుకుంటే కొడాలి లాంటి వాళ్ళు రెచ్చిపోయి తనపై తిట్లదండకం మొదలుపెడతారని చంద్రబాబుకు బాగా తెలుసు.
అందుకనే కొడాలి లాంటి వాళ్ళను రెచ్చగొట్టి తిట్టించుకుని జనాల్లో సానుభూతి సంపాదించుకునేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ నేతలే అంటున్నారు. అంటే కావాలని కొడాలి లాంటి వాళ్ళను చంద్రబాబే కావాలని రెచ్చగొడుతున్నారని అనుకుంటున్నారు. సరే తాను చంద్రబాబును ఎందుకింతలా తిడుతున్నది స్వయంగా కొడాలే వివరణ ఇచ్చేశారులేండి. ఏదేమైనా వ్యక్తిగత దూషణలు హద్దులు దాటితే వినటానికి బాగోదు.
This post was last modified on December 18, 2020 10:23 am
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…
ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్…
జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని…
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…