Political News

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, దానిని పార్టీకి ఆపాదించవద్దని శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. తనపై కేసు నమోదైన విషయం తనకు తెలియదన్నారు శ్రీధర్. అయినా సరే, ఎటువంటి కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా చట్టప్రకారం ముందుకెళ్తానని చెప్పారు.

జనసేన పార్టీ ఆదేశాల ప్రకారం విచారణ కమిటీ ముందు హాజరై వివరణనిచ్చానని అరవ శ్రీధర్ తెలిపారు. తన వాదనను ఆధారాలతో సహా కమిటీకి నివేదించానని చెప్పారు. ఆ నివేదిక అధిష్టానం దగ్గరకు చేరుతుందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అసెంబ్లీ సమయంలోనూ వీడియో కాల్ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోపై కూడా కమిటీకి క్లారిటీ ఇచ్చానని అరవ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు.

అయితే, తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు అవాస్తవమని, అది డీప్ ఫేక్ వీడియో అని స్వయంగా అరవ శ్రీధర్ విడుదల చేసిన వీడియో ఆధారంగా నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ మొదలుబెట్టారు. అప్పుడో మాట..ఇప్పుడో మాట చెబుతున్న శ్రీధర్ క్రెడిబులిటీని ప్రశ్నిస్తున్నారు. ముందే అది వ్యక్తిగత వ్యవహారమని చెప్పి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదని అంటున్నారు. ఇక, అరవ శ్రీధర్ తల్లి అయితే తన బిడ్డ అమాయకుడని చెప్పిన విషయాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

This post was last modified on February 4, 2026 10:30 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

5 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago