Political News

ట్రంప్ తో ఒప్పందం… పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. తొలుత 25 శాతం మేర టారిఫ్‌లు విధించగా, అనంతరం రష్యా చమురు కొనుగోలుతో సంబంధం ఉన్న పెనాల్టీ టారిఫ్‌లను కూడా జోడించి వివిధ రంగాల్లో ఆందోళనకు దారి తీసింది. రష్యా చమురు కొనుగోలును తగ్గించకపోతే టారిఫ్‌లపై సడలింపు ఉండదన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారు.

ఇప్పుడు రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తూ, అమెరికా తో పాటు వెనుజువేలా వంటి ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు పెంచేందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిఫలంగా భారత్‌పై ఉన్న మొత్తం టారిఫ్‌లను 25 శాతం స్థాయి నుంచి 18 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.

ఇది వాణిజ్య రంగానికి కొంత ఉపశమనాన్ని ఇవ్వగల అంశమే అయినా, మరోవైపు అతి తక్కువ ధరలకు, భారీ డిస్కౌంట్లతో లభిస్తున్న రష్యా చమురు కొనుగోలు ఆపడం వల్ల ఎదురయ్యే ప్రభావాలు తీవ్రంగా ఉండొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదెలాగో చూద్దాం.

గత కొన్ని సంవత్సరాలుగా భారత్ తన చమురు అవసరాల్లో అధిక వాటాను రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రష్యా చమురు తక్కువ ధరకు, డిస్కౌంట్లతో లభించడమే. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండగలిగాయి.

ఇప్పుడు రష్యా చమురు దిగుమతులు తగ్గించి, అమెరికా లేదా ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తే, ఆ భారమంతా నేరుగా రిఫైనర్లపై పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్ప వారికి వేరే మార్గం మిగలకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే భారత్ రష్యా చమురును పూర్తిగా నిలిపివేస్తుందన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. ఇది పూర్తిగా మార్కెట్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ సరఫరా ఒప్పందాలు, అలాగే ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ ఎలాంటి వ్యూహం రచిస్తుందో చూడాల్సి ఉంది.

ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా రష్యా చమురు కొనుగోలు భారీగా తగ్గితే, దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల్లో కనిపించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on February 3, 2026 11:08 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago