ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు అతీతీంగా నాయకులు.. స్పందించారు. జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్.. ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉన్నారంటూ.. టీడీపీ నాయకులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విమర్శలు గుప్పించారు. జగన్ వైఖరికి నిరసనగా.. శుక్రవారం రాజధాని ప్రాంతంలోనూ నిరసనలు చేపట్టనున్నారు.
జగన్ ఏమన్నారు?
వైసీపీ అధినేత జగన్.. గురువారం కొన్ని జాతీయ మీడియా ఛానెళ్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు. “నదీతీరం వెంబడి సోకాల్డ్ రాజధానిని కడుతున్నాడు“ అంటూ.. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “రివర్ బేసిన్‌లో చంద్రబాబు సోకాల్డ్ రాజధాని కడుతున్నాడు. అయినా.. అంత భూమి ఎందుకు? ఇంత మంది రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు?“ అని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఇటు రాజధాని రైతుల్లోనూ.. అటు వైసీపీయేతర రాజకీయ నాయకుల్లోనూ దుమారం రేపాయి. జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి జగన్ వైఖరి మారలేదని.. నాయకులు విరుచుకుపడ్డారు. వాస్తవానికి ప్రస్తుతం రాజధాని వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిర్మాణాన్ని విస్తరించడంతోపాటు.. విమానాశ్రయం.. వంటి తొలిదశలో లేని ప్రాజెక్టులను కూడా ఈ సారి చేర్చింది. దీంతో రెండో దశ భూ సమీకరణ కూడా జరుగుతోంది.
ఇలాంటి సమయంలో ఉద్దేశ పూర్వకంగా జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని నాయకులు, రాజధాని రైతులు కూడా తప్పుబట్టారు. జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. రాజధాని నిర్మాణాన్ని నదీ వడ్డున నిర్మిస్తున్నారని.. జగన్ గతంలోనూ చెప్పారు. కానీ, ప్రజలు, కేంద్రంలోని హరిత ట్రైబ్యునల్ కూడా యాక్సప్ట్ చేసినప్పుడు.. జగన్‌కు వచ్చిన సందేహం ఏంటి? వివాదం ఏంటి? అనేది ప్రశ్న. మొత్తంగా.. మరోసారి జగన్ చేసిన వ్యాఖ్యలు.. రాజధానిపై ఆయన నైజాన్ని చాటుతున్నాయని పలువురు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 9, 2026 9:36 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…