సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
కొందరు సభ్యులు సభకు వచ్చినట్లుగా హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసి, సమావేశాల్లో పాల్గొనకుండా తిరిగి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టికి వెళ్లడంతో, కమిటీ సమావేశమై దీనిపై కీలక చర్చ జరిపింది.
అసెంబ్లీ కమిటీ హాలులో ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిశీలించారు. కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు.
అసెంబ్లీ అధికారుల నివేదిక ప్రకారం, సభకు హాజరు కాకుండానే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు వేతనాలు పొందుతుండగా, వారిలో కొందరు టీఏ, డీఏలను కూడా క్లెయిమ్ చేసినట్లు వెల్లడైంది. ప్రజాప్రతినిధులు శాసనసభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, అర్హత లేకున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఆ హోదా ఇస్తేనే సభకు వస్తామని చెప్పడం దేశ శాసనసభ చరిత్రలోనే అపూర్వమని వ్యాఖ్యానించారు. సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే తుది నిర్ణయానికి ముందు న్యాయ నిపుణులు, మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలను సేకరించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఎథిక్స్ కమిటీ తీసుకునే నిర్ణయంపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
This post was last modified on January 8, 2026 10:57 am
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…