ఒకరు అధికార పార్టీకి చెందిన ఎంపీ. మరొకరు విపక్ష పార్టీ నేత. ఇరువురి మధ్య మొదలైన మాటల యుద్దం అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా మారటమే కాదు.. మంట పుట్టిస్తోంది. చలికాలంలో వేడెక్కిపోయేలా ఉన్న ఈ మాటలు ఎక్కడి వరకు తీసుకెళతాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అనంత జిల్లాలోని యూత్ రాజకీయాలు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లటం గమనార్హం. ఇంతకీ.. ఈ మాటల యుద్ధం అసలెలా మొదలైంది? ఇప్పటివరకు ఎక్కడివరకు వచ్చిందన్న విషయాల్లోకి వెళితే..
తాజాగా అనంతపురంలో వర్చువల్ పద్దతిలో రిజర్వాయర్లకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. గతంలో జరిగిన అంశాల్ని వర్తమానంలో ప్రస్తావించిన వైనం రాజకీయ అలజడికి కారణమైంది. సీమలో పొలాలకు నీరు లేక.. నెర్రలు కొట్టి.. పైరుచస్తుంటే.. పరిటాల రవి నక్సలిజం.. ఫ్యాక్షనిజం పేరుతో ప్రజల తలలు నరికి రక్తపుటేర్లు పారించారంటూ గోరంట్ల వ్యాఖ్యలు చేశారు.
దీంతో.. పరిటాల రవి తనయకుడు పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఎంపీ మాటలకు ఘాటుగా రియాక్టు అయ్యారు. అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘నీ మీద ఉన్న రేప్.. మర్డర్ కేసుల్ని మొదట చూసుకో. తర్వాత మా గురించి మాట్లాడు. మేం గల్లీ ఫ్యాక్షన్ అయితే.. నీవు ఢిల్లీ సథాయి రేపిస్ట్ అయ్యావు’ అంటూ ఘాటుగా స్పందించారు. పరిటాల హయంలో ఎస్ఐగా ఉన్న గోరంట్ల ఏం చేశావని ప్రశ్నించిన శ్రీరామ్.. ‘ఇప్పుడు మీ టైం నడుస్తోంది. భవిష్యత్తులో మా టైం వస్తుంది’ అన్న మాటలు సంచలనంగా మారాయి.
టీడీపీ హయాంలో చేసిన పనుల్ని తమ ప్రభుత్వంలో చేసినట్లుగా చెబుతున్నారన్న పరిటాల శ్రీరామ్.. కొత్త పనులకు టెండర్లు ఎందుకు పిలవటం లేదు? అని ప్రశ్నించారు. పుట్టకనుమ ప్రాజెక్టును ఆపి.. కొత్తవి చేయటం సరికాదని.. ప్రాజెక్టుపేరు మార్చటం ఏమిటని నిలదీశారు. పుట్టకనుమ ప్రాజెక్టును రద్దు చేసి.. మూడు కడతామని అంటున్నారని.. ఎందుకు టెండర్ పిలవటం లేదని ప్రశ్నించారు. అధికార.. విపక్ష నేతల మధ్య నడుస్తున్న మాటలు తూటాల మాదిరి మారి.. రాజకీయ హీట్ ను పెంచేస్తున్నాయని చెప్పక తప్పదు.
This post was last modified on December 12, 2020 12:55 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…