40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఉన్నట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిలు ఉండకపోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న సీఎం చంద్రబాబు ఓటు బ్యాంకును కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
అదే విధంగా మరింత ఓటు బ్యాంకు పెంచుకునే విషయంలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకును భారీ స్థాయిలో దెబ్బతీసే విషయంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన ఎస్టీ సామాజిక వర్గాలకు చాలా చేరువయ్యారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపాధి అదేవిధంగా సంప్రదాయ వృత్తుల్లో శిక్షణ కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఎస్టీ ఓటు బ్యాంకు పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో తీసుకువచ్చిన భారీ మార్పులు కారణంగా అక్కడ కూడా ఎస్సీ ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుంది. వైసిపి హయాంలో ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాల్లో రహదారుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల నిర్మాణం లాంటివి చేపడుతున్నారు. తద్వారా ఎస్సి ఓటు బ్యాంకు అటు బిజెపికి, టిడిపికి అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో గతంలో తెచ్చుకున్న ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో నిలబడుతుందా అంటే చెప్పడం కష్టమనేది ప్రస్తుతం విశ్లేషకులు వేస్తున్న అంచనా. కానీ, వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అంతా అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా వ్యతిరేకత ఉంటుంది. అయితే అదే సమయంలో దాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా వైసిపి ప్రయత్నాలు అయితే చేయాలి. ఆ ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు. పైగా ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న దాడిని తట్టుకునే స్థాయిలో వైసిపి బలమైన కౌంటర్ ఇవ్వడం లేదు.
దీంతో గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అనేది సందేహంగా ఉంది. ఇక, ఓటు బ్యాంకు పెరగడం అనేది పెద్ద అవకాశం లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీన్ని బట్టి భవిష్యత్తు వ్యూహాలు, భవిష్యత్తు అంచనాలు మార్చుకునే నూతన దిశగా అడుగులు వేస్తే తప్ప వైసీపీకి మరోసారి ఓటు బ్యాంకు దక్కించుకునే అవకాశం కష్టం అన్నది ప్రస్తుతం ఉన్న అంచనా. మరి ఏం జరుగుతుంది ఏం చేస్తారు అనేది చూడాలి.
This post was last modified on December 14, 2025 2:00 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…