ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా తీసుకున్న నిర్ణయం కాదు, భయం అలా ఉంది మరి. ఇన్నాళ్లు ఎంతో జోష్ గా కనిపించిన మస్క్ లో ఇప్పుడు టెన్షన్ క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ అమెరికాలో జరిగిన చార్లీ కిర్క్ హత్యే. ఆ ఒక్క సంఘటన మస్క్ ను పూర్తిగా మార్చేసింది.
“లైఫ్ ఇప్పుడు హార్డ్ కోర్ లాగా డేంజర్ జోన్ లో ఉంది.. ఒక్క చిన్న తప్పు జరిగినా ప్రాణం పోతుంది” అని మస్క్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చార్లీ కిర్క్ ను చంపిన తీరు చూశాక మస్క్ బాగా డిస్టర్బ్ అయ్యారు. మన చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఒక్క చిన్న ఛాన్స్ దొరికితే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆయన అంటున్నారు. అందుకే పబ్లిక్ లోకి రావడం తగ్గించేశానని క్లారిటీ ఇచ్చారు.
చార్లీ కిర్క్ ను పట్టపగలే, అందరూ చూస్తుండగానే కాల్చి చంపడం మామూలు విషయం కాదు. ఒక బిల్డింగ్ పై నుంచి స్నైపర్ లాగా గురి చూసి మరీ కాల్చేశారు. షూటర్ వాడిన గన్ మీద వీడియో గేమ్స్ లో ఉండే గుర్తులు ఉండటం చూస్తుంటే.. ఇది పక్కా ప్లాన్ తో చేసిన పని అని అర్థమవుతుంది. ఇలాంటి సిచువేషన్ లో ఎవరి ప్రాణానికైనా గ్యారెంటీ ఎక్కడుంది అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న భయం అని మస్క్ లాంటి వాళ్లు అంటున్నారు.
ఒక మనిషి చనిపోతే అయ్యో అనాల్సింది పోయి, సోషల్ మీడియాలో కొందరు పండగ చేసుకోవడం మస్క్ కు కోపం తెప్పించింది. ఇది రాక్షస ఆనందం అని, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసేది హత్యకే అని ఆయన మండిపడ్డారు. మనం గట్టిగా తిరిగి పోరాడకపోతే, చివరికి వాళ్ళు మనల్ని చంపేస్తారంటూ మస్క్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా దీనిపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆ తుపాకీ చార్లీ వైపు గురిపెట్టినా, నిజానికి అది మనందరినీ భయపెట్టడానికే అని ఆయన అన్నారు. మనసులో ఉన్న మాట చెప్పినందుకే అతన్ని చంపేశారని ఫీల్ అయ్యారు.
This post was last modified on December 11, 2025 6:15 pm
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…