తమిళనాడులో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అక్కడున్నన్ని పార్టీలు బహుశా మరే రాష్ట్రంలోను ఉండవేమో అన్నట్లుగా ఉంటుంది పరిస్ధితి. రాష్ట్రవ్యాప్తంగా పాపులరైన ఉన్న పార్టీలే కనీసం అరడజనుంటాయి. ఇక రాష్ట్రంలోని ఏదో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలు కూడా కొన్నున్నాయి. అంటే ప్రాంతీయ పార్టీల మధ్యలోనే ఉపప్రాంతాయ పార్టీల్లాగ అన్నమాట. ఎన్నికలు వస్తున్నాయంటేనే గందరగోళంగా ఉండే తమిళనాడులో తలైవా రజనీకాంత్ ఆధ్వర్యంలో తొందరలోనే మరో పార్టీ రాబోతోంది.
నిజానికి తలైవా ఆధ్వర్యంలో పార్టీ అంటేనే కొత్త సినిమా రిలీజప్పుడుండే హడావుడి ఉండలి. కానీ రజనీ పొలిటికల్ ఎంట్రీ విషయంలో పెద్దగా సందడి లేదని సమాచారం. డిసెంబర్ 31వ తేదీన రాజకీయ పార్టీ పేరు, దాని విధి విదానాలను ప్రకటిస్తానని స్వయంగా రజనీయే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే రజనీ స్టేట్మెంట్ పై ఇతర రాజకీయ పార్టీల్లో కానీ లేదా ప్రముఖుల్లో గానీ పెద్దగా స్పందనే కనబడటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే గతంలో కూడా రజనీ పార్టీ పెడతానని చాలాసార్లు చెప్పినట్లే ఇఫుడు కూడా చెప్పారంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి చాలా తేలిగ్గా తీసిపారేశారు. పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించినపుడు చూసుకోవచ్చులే అని మీడియాతోనే చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే ఇతర పార్టీల్లో కూడా రజనీ పెట్టబోయే పార్టీ విషయంలో పెద్దగా టెన్షన్ కూడా ఉన్నట్లు లేదు. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పటికే ఎన్నికలైపోతాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2021, మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. మేలో ఎన్నికలంటే కనీసం 45 రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఏప్రిల్ రెండోవారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రజనీ ఏమో పార్టీని డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పారు. అంటే పార్టీ ప్రకటన నుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మధ్యలో మహా అయితే ఓ మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉంటుంది. మరి ఈ మూడు నెలల్లో జనాల్లోకి పార్టీని తీసుకెళ్ళేదెలాగ ? సభ్యత్వ నమోదును పక్కనపెట్టేసినా అభ్యర్ధుల ఎంపికంటే మామూలు విషయం కాదు.
రజనీ పార్టీ ప్రకటిస్తే చాలు ఓట్లవే వచ్చి పడిపోతాయని చెప్పటానికి ఇదేమీ సినిమా కాదు. ఎందుకంటే బలమైన డిఎంకే, అధికార ఏఐఏడిఎంకె లాంటి గట్టిపార్టీలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ తట్టుకుని తన అభ్యర్ధులను గెలిపించుకోవాలంటే మూడు, నాలుగు మాసాల సమయం ఏ విధంగాను సరిపోదు. ఈ విషయాలన్నింటినీ అంచనా వేసుకునే మిగిలిన పార్టీలు రజనీ పొలిటికల్ ఎంట్రీని చాలా తేలిగ్గా తీసుకున్నట్లున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కలు రజనీకి తెలియకుండానే ఉంటాయా ? మరి తెలిసి కూడా ఏ లెక్క ప్రకారం ప్రకటనిచ్చేసి మళ్ళీ హైడవుట్ లోకి వెళ్ళిపోయారు? చూద్దాం డిసెంబర్ 31వ తేదీన ఏం చేస్తారో ?
This post was last modified on %s = human-readable time difference 7:10 am
https://www.youtube.com/watch?v=FKtnAhHnfUo ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు…
ఏపీలో గత కొద్ది రోజులుగా అత్యాచార ఘటనలు, హత్యాచార ఘటనలు జరుగుతున్న వైనం కలచివేస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎంత…
మొన్న విపరీతమైన పోటీలో విడుదలైన అమరన్ తమిళంలో భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు కానీ తెలుగులోనూ అదీ టైటిల్…
జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రోడ్ల సంగతి పక్కనబెడితే…ఉన్న…
అన్ స్టాపబుల్ షో చూశాక బాలయ్య ఎనర్జీ అఫ్ స్క్రీన్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయ్యింది కానీ…
ఇప్పుడు మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. గతంలో మల్లువుడ్ స్టార్లు టాలీవుడ్ స్ట్రెయిట్…