Political News

అమెరికాలో లోకేష్… టీ-11 కు నిద్ర పట్టట్లేదా?

పెట్టుబ‌డులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమెరికా స‌హా పొరుగున ఉన్న‌ కెన‌డా దేశాల‌ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. 5 రోజుల పాటు ఆయా దేశాల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. తొలుత అమెరికాకు చేరుకున్న నారా లోకేష్‌కు డ‌ల్లాస్‌లో ఏపీ ఎన్నార్టీ నాయ‌కులు, స్థానిక ప్ర‌వాసాంధ్రుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంత‌రం.. ఆయ‌న తెలుగు ప్ర‌వాసుల‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అండ‌గా ఉన్న తెలుగు వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వ‌రల్డ్ బ్యాంకులో ప‌నిచేశా..

తాను అమెరికాలోనే చ‌దువుకున్నాన‌ని.. ఇక్క‌డి ప్ర‌పంచ బ్యాంకులోనూ ప‌నిచేశాన‌ని నారా లోకేష్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికాతో త‌న‌కు తొమ్మిది సంవ‌త్స‌రాల అనుబంధం ఉంద‌న్నారు. కాగా.. ప్ర‌వా సాంధ్రులు ఎక్క‌డ ఉన్నా.. వారికి అండ‌గా నిలుస్తామ‌ని చెప్పారు. 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌వాసాంధ్రులు చేసిన కృషి.. ఏపీ ప్ర‌జ‌లు బాగుండాల‌ని వారు చేసిన ప్ర‌చారాన్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని చెప్పారు. తాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్న‌ప్పుడు కూడా వారు అంతే మ‌ద్ద‌తు ఇస్తున్నార‌న్నారు.

టీ-11.. వైసీపీపై సెటైర్లు

ఈ సంద‌ర్భంగా వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. టీ-11 అంటూ వైసీపీని సంబోధించిన ఆయ‌న‌.. వారికి త‌న ప‌ర్య‌ట‌న‌లు చూసి, త‌న ప్ర‌సంగాలు విని.. త‌న‌కు వ‌స్తున్న మ‌ద్ద‌తును చూసి నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యార‌ని తెలిపారు. చంద్ర‌బాబు స్పీడును అందుకునేందుకు తాను ఎంతో శ్ర‌మిస్తున్న‌ట్టు చెప్పారు. తెలుగు వారి మ‌ద్ద‌తు ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

నాలుగు రోజుల షెడ్యూల్ ఇదీ..

7వ తేదీ: డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొంటారు.

8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌మావేశం చేప‌ట్టారు.

10న కెన‌డా వెళ్లారు. అక్క‌డి టొరంటోలో  నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సులో పాల్గొని పారిశ్రామిక వేత్త‌ల‌ను ఏపీకి ఆహ్వానిస్తారు.

This post was last modified on December 8, 2025 9:28 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

1 hour ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

2 hours ago

అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…

5 hours ago

లోకేష్‌తో సినిమాపై తేల్చేసిన స్టార్ హీరో

కూలీ సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో.. ఎన్ని ఊహాగానాలు…

6 hours ago

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

9 hours ago

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…

11 hours ago