ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి గందరగోళం, ప్రతి మానసిక సమస్యకు పరిష్కారంగా మనల్ని నడిపించే ఙ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు. భగవద్గీతలోని అంశాలను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు, నేటి తరానికి భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఉడుపిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు..
అనంతరం పవన్ కళ్యాణ్ కు”అభినవ కృష్ణ దేవరాయ” అనే బిరుదును పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ ప్రధానం చేశారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆశయాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని, ప్రయత్నాలను గుర్తించి ఉడిపి శ్రీ కృష్ణ మఠానికి చెందిన పీఠాధిపతి ఆయనను “అభినవ శ్రీ కృష్ణ దేవరాయ” అనే బిరుదుతో గౌరవించారు. విశేషం ఏమిటంటే ఉడిపి శ్రీ కృష్ణ మఠం అభినవ శ్రీ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేస్తూ ఒకర్ని సత్కరించటం ఇదే తొలిసారి.
పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారంటే.. సినిమాలు, వినోదానికి ప్రజలు భారీగా ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతికి ప్రతీక అయిన గోమాతను కాపాడడం కూడా అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. “వ్యక్తిగతంగా నేను 60 ఆవులను సంరక్షిస్తూ గోశాల నడుపుతున్నాను. మనం పూజించే పవిత్ర గోమాతను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అక్రమ వధపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆవులను సంరక్షించడం కూడా ఎంతో అవసరం,” అని అన్నారు.
This post was last modified on December 7, 2025 10:38 pm
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…