తెలంగాణాలో పుంజుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా ? జాతీయ పార్టీగా మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ తన కార్యక్రమాలను ప్రస్తుతానికి ఏపికే పరిమితం చేసింది. అయితే పార్టీ పెట్టిన కొత్తల్లోనే అంటే 2014 ఎన్నికల్లోనే ఏపితో పాటు తెలంగాణాలో కూడా పోటీ చేసింది. ఖమ్మం ఎంపితో పాటు మూడు అసెంబ్లీ స్ధానాల్లో కూడా గెలిచింది. తర్వాత ఏపిపై దృష్టి పెట్టాల్సి రావటంతో తెలంగాణాను పట్టించుకోలేదు. దాంతో ఎంపి, ఎంఎల్ఏలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో అఖండ మెజారిటితో ఏపిలో అధికారంలోకి వచ్చిన కారణంగా మళ్ళీ తెలంగాణాలో పార్టీ కార్యక్రమాలపై జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఏపిలో అధికారం సుస్ధిరమైన కారణంగా తెలంగాణాలో కూడా సత్తా చాటాలని జగన్ డిసైడ్ అయ్యారట. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఏపిలో వైసీపీ జనాల్లో దూసుకుపోతోందని జగన్ భావిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇవి బాగా ప్రచారం అయ్యాయని… వీటి ప్రభావం కచ్చితంగా పనిచేస్తుందని జగన్ భావిస్తున్నారట.
ఇదే సమయంలో తెలంగాణాలో రాజకీయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద వచ్చేసిందని జగన్ అభిప్రాయపడుతున్నారట. టీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్, టీడీపీలు అడ్రస్ లేకుండా పోయాయి. టీఆర్ఎస్ ను ఢీ కొట్టేంత సీన్ ఏ రాజకీయ పార్టీకి లేదని అనుకుంటున్న సమయంలోనే మెల్లిగా బీజేపీ పుంజుకుంటోంది. ఇపుడు ఎంటరైతే బీజేపీ కంటే తానే బలంగా ఎదిగే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట.
రెడ్లు ఎక్కువగా ఉండటం, బీజేపీ సైద్ధాంతికంగా మత పార్టీ కావడంతో మూడోపార్టీ పుంజుకునేందుకు కావాల్సినంత స్పేస్ ఉంది తెలంగాణాలో ఇపుడు అని జగన్ ఆలోచన. అందుకనే ఇపుడు తన పార్టీని మళ్ళీ యాక్టివేట్ చేస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఏదో ఒకటి రెండు జిల్లాలు మినహాయిస్తే చాలా జిల్లాల్లో వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దెబ్బతినటంతో రెడ్డి సామాజికవర్గానికి అండ లేకుండా పోయింది.
అలాగే ఏపిలో తన పథకాలు తెలంగాణాలో పేదలను ఆకట్టుకున్నాయని జగన్ కి నివేదికలు అందాయట. కాబట్టి రెడ్లతో పాటు తెలంగాణలో అధికంగా ఉ్న బీసీ, ఎస్సీ+ఎస్టీలను ఆకట్టుకోగలిగితే తెలంగాణాలో కూడా వైసీపీ పుంజుకోవటం పెద్ద విషయం కాదని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉండలేక, బీజేపీలో చేరలేకుండా స్తబ్దుగా ఉన్న చాలామందికి వైసీపీ బలమైన వేదిక అవుతుందని వైసీపీ అనుకుంటోంది. కాబట్టి తొందరలోనే జగన్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
అయితే అది ఏదైనా సంక్రాంతి తర్వాతే అంటున్నారు.
This post was last modified on December 8, 2020 11:48 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…