ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ ముగ్గురు 420 చేష్టలు చేస్తున్నారని, వారిపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వెయ్యాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇదే తరహాలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మోసం చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టి ఉండేవారు కదా అని జగన్ ప్రశ్నించారు. ఈ ముగ్గురి మోసాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రాయరని, వాళ్ళంతా ఒకటే దొంగల ముఠా అని, దోచుకుని పంచుకుని తింటుంటారని ఎద్దేవా చేశారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కాకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారని, రెండేళ్లకు రూ.40 వేలు ఇస్తామన్నారని, ఇచ్చింది రూ.10 వేలు అని, ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.
తల్లికి వందనం లబ్ధిదారులను రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి తగ్గించారని ఆరోపణలు చేశారు.
నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల చొప్పున రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలని, ఇచ్చారా? అని ప్రశ్నించారు.
18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18000ల చొప్పున రెండేళ్లకు రూ.36,000 ఇవ్వలేదని విమర్శించారు.
This post was last modified on December 4, 2025 1:25 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…